ఐదు రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల్లో బీజేపీ నాలుగు చోట్ల విజయం సాధించడంతో, దేశ వ్యాప్తంగా ఆ పార్టీలో జోష్ పెరిగింది.ముఖ్యంగా తెలంగాణ బిజెపి లో ఆ సందడి కనిపిస్తోంది.
తప్పకుండా అధికారంలోకి వస్తామనే ధీమా కూడా పెరిగింది.దీంతో ధీమా గానే ప్రకటనలు చేస్తున్నారు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్.
కెసిఆర్ తీరుకు నిరసనగా ప్రజల బాధలు తెలుసుకునేందుకు ఎన్నో పోరాటాలు చేశామని, ఎంతో మంది కార్యకర్తలు కేసులు ఎదుర్కొన్నారని, తన వంటి సామాన్యుడికి కూడా ఇంత పెద్ద బాధ్యతలు బిజెపి అధిష్టానం అప్పగించిందని, అసలు ఇలా జరుగుతుందని ఊహించలేదని బండి సంజయ్ చెబుతున్నారు.ప్రజలంతా డబుల్ ఇంజన్ సర్కార్ కావాలని కోరుకుంటున్నారని, అది తెలిసే కేసిఆర్ తెలంగాణ సెంటిమెంట్ ను మరోసారి రగిల్చేందుకు, దానిద్వారా బిజెపి ని ఎదుర్కొనేందుకు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు.
గతంలో ఎప్పుడు కేసీఆర్ ప్రధాని నరేంద్ర మోదీ కి లేఖ రాయలేదన్నారు. కేసిఆర్ ఎన్నికల్లో ఓడిపోతాడు అని తెలిసి కూడా కొత్త జిమ్మిక్కులు చేస్తున్నారని మండిపడ్డారు.
కేంద్రంలోనూ మరోసారి బిజెపి అధికారంలోకి వస్తుందని, తెలంగాణలోనూ తమ పార్టీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు.తెలంగాణ ప్రజలు టిఆర్ఎస్ కు ప్రత్యామ్నాయం కోరుకుంటున్నారని, అందుకే బిజెపి వైపు చూస్తున్నారు అని చెప్పిన ఆయన, ఈ సందర్భంగా రాబోయే ఎన్నికల్లో బీజేపీకి ఏ పార్టీతో పొత్తు లు ఉండవని క్లారిటీ ఇచ్చారు.
ప్రజాసంకల్పయాత్ర ఇప్పటికే ఒకసారి చేపట్టిన బండి సంజయ్ వచ్చే నెల 14 నుంచి ప్రజాసంకల్పయాత్ర కొనసాగించేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు.
ఇప్పటికీ టిఆర్ఎస్ ప్రభుత్వం ను అన్ని విధాలుగా ఇరుకున పెడుతూ వస్తున్న బండి సంజయ్ టిఆర్ఎస్ ప్రభుత్వం పై ప్రజల్లో వ్యతిరేకత ను మరింత హైలైట్ చేసి బిజెపి పై ఆదరణ పెంచేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. దీనికి కేంద్ర బిజెపి నుంచి తగిన సహాయ సహకారాలు మరింతగా అందబోతున్నాయి.రాష్ట్రాల ఎన్నికలు ముగియడంతో పూర్తిస్థాయిలో తెలంగాణపైనే బీజేపీ అధిష్టానం దృష్టి సారించబోతోంది.
దీంతో తెలంగాణ బిజెపి నాయకులలోను ఆశలు పెరిగాయి.అందుకే బిజెపి తెలంగాణలో ఒంటరిగానే పోటీ చేయాలని దాదాపు డిసైడ్ అయిపోయింది.
జనసేన పార్టీతో పొత్తు కొనసాగిస్తున్నా, తెలంగాణలో మాత్రం జనసేన మద్దతు పొందేందుకు ఆ పార్టీ రాష్ట్ర నాయకులు ఎవరు ఇష్టపడడం లేదట.టిఆర్ఎస్ పై బిజెపి ఒంటరి పోరాటం ఎంతవరకు సక్సెస్ అవుతుందో.