స్టార్ డైరెక్టర్ రాజమౌళికి ఇండస్ట్రీలో ఒక ప్రత్యేకత ఉంది.ఏ స్టార్ హీరోతో సినిమా చేసినా ఆ హీరోకు రాజమౌళి కెరీర్ బిగ్గెస్ట్ హిట్ ఇస్తారు.
సినిమా తొలి సన్నివేశం నుంచి క్లైమాక్స్ వరకు అద్భుతంగా ఉండేలా రాజమౌళి జాగ్రత్తలు తీసుకుంటారు.తెలుగుతో పాటు ఇతర భాషల ఆడియన్స్ కు కూడా నచ్చేలా రాజమౌళి సినిమాలను తెరకెక్కిస్తారు.
బాహుబలి, బాహుబలి2 సినిమాలతో రాజమౌళి ప్రభాస్ మార్కెట్ ను అమాంతం పెంచేశారు.
బాహుబలి సిరీస్ సినిమాల వల్ల విదేశాల్లో కూడా ప్రభాస్ కు అభిమానులు ఏర్పడ్డారు.
అయితే రాజమౌళి సినిమాలో నటించిన తర్వాత హీరోలు కొంతకాలం పాటు కెరీర్ లో ఒడిదొడుకులు ఎదుర్కొంటారని ఇండస్ట్రీలో సెంటిమెంట్ ఉంది.ఛత్రపతి సినిమా తర్వాత ప్రభాస్ కొన్నేళ్ల పాటు సరైన హిట్ లేక కెరీర్ విషయంలో ఇబ్బందులు పడ్డారు.బాహుబలి2 సినిమా తర్వాత ప్రభాస్ నటిస్తున్న సినిమాలు ఆశించిన స్థాయిలో సక్సెస్ సాధించడం లేదు.
రాజమౌళి డైరెక్షన్ లో నటించిన కొంతమంది హీరోలు తర్వాత సినిమా ఫ్లాప్ అయినా మరో సినిమాతో సక్సెస్ ట్రాక్ లోకి వస్తుంటే కొంతమంది హీరోలకు మాత్రం సక్సెస్ రావడానికి సమయం పడుతోంది.
ప్రభాస్ నటించిన సాహో, రాధేశ్యామ్ సినిమాలు ప్రేక్షకులను తీవ్రస్థాయిలో నిరాశపరిచాయి.ఆదిపురుష్, సలార్ సినిమాలతో ప్రభాస్ సక్సెస్ ట్రాక్ లోకి వస్తారని ఫ్యాన్స్ భావిస్తుండటం గమనార్హం.

ఈ రెండు సినిమాలు ఇండస్ట్రీ హిట్లుగా నిలుస్తాయని ఫ్యాన్స్ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.సలార్ సినిమా త్వరగా విడుదలైతే బాగుంటుందని ఫ్యాన్స్ అనుకుంటున్నారు.మారుతి డైరెక్షన్ లో ఒక సినిమాకు ప్రభాస్ ఓకే చెప్పారని వార్తలు రాగా రాధేశ్యామ్ యావరేజ్ రిజల్ట్ ను సొంతం చేసుకున్న నేపథ్యంలో ప్రభాస్ ఆ సినిమా విషయంలో ఎలా వ్యవహరిస్తారో చూడాల్సి ఉంది.