ఏపీ రాజధాని హైదరాబాద్ అని మంత్రి బొత్సా మాట్లాడడం విడ్డూరంగా ఉంది.విలేకరులకు పంపిన వీడియో లో ప్రభుత్వ తీరును ఎండగట్టిన మాజీ మంత్రి అయ్యన్న.
మీరన్నట్టు హైదరాబాద్ రాజధానిలో సీఎం ఉంటే మర్నాడే సీబీఐ వచ్చి అరెస్ట్ చేస్తుంది.స్పీకర్ తమ్మినేని గీత దాటితే వేటు వేస్తామని టీడీపీ సభ్యులనుద్దేశించి అనటం తప్పు.
అంటే గీత దాటితే కత్తితో నరికేస్తారా.
ఇది ప్రజాస్వామ్యం అనుకుంటున్నారా? రాజారెడ్డి రాజ్యాంగం అనుకుంటున్నారా? టిడిపి సభ్యులు అసెంబ్లీలో ప్రశ్నించకూడదా?? గవర్నర్ ప్రభుత్వం పంపిన స్క్రిప్టుని అసెంబ్లీలో చదివారు.దానిలో చాలా తప్పులు ఉన్నాయి.వృద్ధిరేటు విషయంలో అంకెల గారడీ చేస్తున్నారు…
.