వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు సొంత పార్టీ పైన, పార్టీ అధినేత ఏపీ సీఎం జగన్ పైన తీవ్ర విమర్శలు చేయడంతో పాటు, కోర్టుల ద్వారా ను ఇరుకున పెట్టే ప్రయత్నం చేస్తున్నారు.ఇప్పటికే ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను తప్పుపడుతూ రఘు రామ కేంద్రానికి, రాష్ట్రపతికి ఫిర్యాదు చేయడంతో పాటు, కోర్టుల్లోనూ పిటిషన్ దాఖలు చేశారు.
ఏపీ ప్రభుత్వం తీసుకున్న ప్రతి నిర్ణయాన్ని తప్పుబడుతూ , మీడియా సోషల్ మీడియా ద్వారా విమర్శలు చేస్తూ వస్తున్నారు.ఇది ఆయనకు నిత్యకృత్యంగా మారింది.
ఇదిలా ఉంటే ప్రస్తుతం ఏపీ ప్రభుత్వానికి అనేక చిక్కుముడులు కోర్టుల ద్వారా ఏర్పడుతున్నాయి. ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలపైన కోర్టు ఆగ్రహం వ్యక్తం చేస్తూ, వాటిని నిలుపుదల చేస్తూ ఉండడం ఇబ్బందికరంగా మారింది.
దీనిపై ఏపీ అసెంబ్లీలో చర్చించేందుకు జగన్ ప్రభుత్వం సిద్ధమవుతుండగా.జగన్ కు రఘురామకృష్ణంరాజు మరో టెన్షన్ కలిగించే విధంగా వ్యవహరిస్తున్నారు.ఈ మేరకు జగన్ అక్రమాస్తుల కేసులో సిబిఐ పాత్ర పైన, విచారణ చేపట్టాలని సీబీఐ ఈ కేసులో పై పై విచారణ చేసి వదిలేసిందని , కీలకమైన సూట్ కేసు కంపెనీలు, విదేశీ నిధుల రాకపోయినా సరైన వివరాలు సేకరించ లేదని తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.దీనికి సంబంధించిన అన్ని వివరాలను పారదర్శకంగా దర్యాప్తు చేసే విధంగా సిబిఐ ను ఆదేశించాలని పిటిషన్ దాఖలు చేశారు.
![Telugu Ap Cm Jagan, Ap, Directorate, Jagan, Telangana-Political Telugu Ap Cm Jagan, Ap, Directorate, Jagan, Telangana-Political](https://telugustop.com/wp-content/uploads/2022/03/jagan-tension-on-raghurama-krishnam-raju-petition-in-high-court-detailss.jpg )
ఈ పిటిషన్ దాఖలు చేసి చాలా రోజులు అవుతుంది.అయినా ఇది విచారణకు రాలేదు.దీనిపై ఆయన తాజాగా హైకోర్టును ఆశ్రయించగా ఈ పిటిషన్ కు నెంబర్ కేటాయించాలని రిజిస్ట్రీ ని హైకోర్టు ఆదేశించింది.జగన్ అక్రమాస్తుల కేసులో 11 అభియోగపత్రం దాఖలు చేసిన సీబీఐ, విదేశాల నుంచి బోగస్ కంపెనీల నుంచి జగన్ కంపెనీలలోకి వచ్చిన పెట్టుబడులపై దర్యాప్తు చేయకుండానే ఆదాయపన్ను శాఖ, ఈడికి లేఖలు రాసి వదిలేసిందని పిటిషన్ లో రఘురామ వివరించారు.
రఘురామ పిటిషన్ ను తెలంగాణ హైకోర్టు పరిగణనలోకి తీసుకుంటే, జగన్ కు మరో తలనొప్పి మొదలవడం ఖాయం.