కలలు రావడానికి గల కారణం ఏంటో మీకు తెలుసా..?

మనం అందరం కూడా రాత్రి నిద్రించే సమయంలో కచ్చితంగా ఏదో ఒక కల కనే ఉంటాము.కలలు అనేవి చాలా రకాలుగా ఉంటాయి.

 Do You Know The Reason Why Dreams Come True Dreams, Health Tips, Health Care, He-TeluguStop.com

మనం కనే కలలు ఒక్కోసారి నిజంగా మన కళ్ల ముందే జరుగుతున్నాయా అనేంత ప్రభావవంతంగా వస్తుంటాయి.అయితే మనకు వచ్చే కొన్ని కలలు మాత్రమే మనకు గుర్తు ఉంటాయి.

ఆ కలను స్పష్టంగా వివరాలతో సహాగుర్తుంచుకుంటాం.కానీ.

, కొన్ని కలలను వివరించేలేము.ఒక్కోసారి మనకు వచ్చిన కల ఇంకా పూర్తికాక ముందే మేల్కొంటాం.

అలాగే ఒక్కోసారి మనకు వచ్చే కలలు భయంకరంగా ఉండడం వలన నిద్రలోంచి ఉలిక్కిపడి లేస్తుంటాము.అయితే తెల్లవారు జామున వచ్చే కలలు నిజం అవుతాయాన్ని చాలా మంది నమ్ముతూ ఉంటారు.

అది నిజామా.లేక అబద్దమా అనే విషయం పట్ల క్లారిటీ లేదు.

అసలు కలలు అనేవి ఎందుకు వస్తాయి.? అది కూడా నిద్రించే సమయంలోనే ఈ కలలు ఎందుకు వస్తాయని మీరు ఎప్పుడన్నా ఆలోచించారా.?అసలు కలల రావడానికి గల కారణాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

ఒక వ్యక్తి తన జీవితంలో జరిగిన ప్రతి రోజును మెదడు జ్ఞాపకం చేసుకునే, కొన్ని ప్రతిచర్యలకు కారణమయ్యే సంఘటనలు చాలానే ఉన్నాయి.

నిజానికి మనం నిద్రించే సమయంలో మన శరీరం మాత్రమే విశ్రాంతిగా ఉంటుంది.కానీ మన మెదడు అందుకున్న మొత్తం సమాచారాన్ని మళ్ళీ పునరావృతం చేస్తుంది ఒకదానికొకటి ఏకీకృతం చేస్తుంది అప్పుడే వచ్చేవే మనకు కలల రూపంలో కనిపిస్తాయి.

అంతేకాకుండా మన పురాణ ఇతిహాస వేదాలలో ఒకటి అయిన ఋగ్వేదంలోని మంత్రపుష్పంలో మన మానవ హృదయం యొక్క అమరిక గురించి ఎలా వర్ణించారో ఒకసారి తెలుసుకుందాం.

మన హృదయంలోనే ఇంద్రియాలు, మనస్సు, ఆత్మ, పరమాత్మ ఉంటారు.అయితే పరమాత్మ ఇచ్చిన ఉనికి వలన మనం ఆత్మ యొక్క జ్ఞానం, మనస్సు అనేవి ఇంద్రియాల ద్వారా బయటకు వచ్చి శరీరం అంతా వ్యాపిస్తుంది.అయితే ఈ జ్ఞానం మానవ శరీరంలోనో 101 నాడులు ద్వారా శరీరపు చివరి అణువు వరకు ప్రసరిస్తూ ఉంటుంది.

కానీ ఒక్కోసారి జ్ఞానం అనేది జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాల ద్వారా మాత్రమే కాకుండా డైరెక్ట్ గా మనస్సు నుండి కూడా ప్రసరించగలుగుతుంది.అలా మనస్సు నుండి ప్రసరించగలగడమే కలలు రావడానికి మూల కరణం.

వాస్తవానికి మానవుడు మెలుకువగా ఉన్నప్పుడు చేసిన పని, చూసిన దృశ్యం అన్ని కూడా వారి మనసులో అలానే ఉండిపోతాయి.అలా నిద్రిస్తున్నప్పుడు మీ శరీర అవయవాలు విశ్రాంతి తీసుకుని, ఇంద్రియాలు విశ్రాంతి తీసుకోకపోతే జ్ఞానం అనేది నాడుల ద్వారా వెళ్లకుండానే తిరిగి మనసులోకి ప్రవేశించి మీకు కలలు రావడాన్ని ప్రేరేపిస్తుంది.

ఇంకో ముఖ్య విషయం ఏంటంటే నిద్రిస్తున్నప్పుడు మన శరీర ఇంద్రియాలపైన నియంత్రణ ఉండదు కాబట్టి కలలకి అంతే ఉండదు.

Do You Know The Reason Why Dreams Come True Dreams

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube