యంగ్ అండ్ ప్రామిసింగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ 19వ చిత్రానికి గూఢచారి, ఎవరు, హిట్ వంటి హిట్ చిత్రాల ఎడిటర్ గ్యారీ బీహెచ్ దర్శకత్వం వహిస్తున్నారు.ఎడ్ ఎంటర్టైనమెంట్స్ పతాకంపై కె రాజశేఖర్ రెడ్డి నిర్మిస్తున్నారు.
చరణ్ తేజ్ ఉప్పలపాటి సీఈఓగా వ్యవహరిస్తున్నారు.ఈ మూవీ నెక్ట్స్ షెడ్యూల్ మార్చి నుండి మనాలీలో ప్రారంభమవుతుంది.
ఈ షెడ్యూల్లో కొన్ని హై-ఆక్టేన్ యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరించనుంది యూనిట్.వాటికోసం నిఖిల్ ఊపిరి బిగబట్టే స్టంట్స్ చేయడానికి శిక్షణ తీసుకుంటున్నాడు.
నిఖిల్ లైవ్ వెపన్ ట్రైనింగ్ తీసుకుంటున్నాడు.
ఇదే విషయాన్ని సోషల్మీడియా ద్వారా తెలుపుతూ ఫోటోలను పంచుకున్నారు.
యాక్షన్తో కూడిన స్పై థ్రిల్లర్గా భారీ స్థాయిలో రూపొందుతున్న ఈ చిత్రానికి టైటిల్ కన్పర్మ్ చేయాల్సిఉంది.ఈ చిత్రంలో నిఖిల్ సరసన ఐశ్వర్యా మీనన్ హీరోయిన్గా నటిస్తోంది.
ఈ సినిమా ఫస్ట్ షెడ్యూల్హైదరాబాద్లోపూర్తయ్యింది.ఈ హై బడ్జెట్ ఎంటర్టైనర్లో ప్రముఖ సాంకేతిక నిపుణులు భాగం కానున్నారు.
జూలియన్ అమరు ఎస్ట్రాడా సినిమాటోగ్రాఫర్గా వ్యవహరిస్తుండగా, దర్శకుడు గ్యారీ బిహెచ్ ఎడిటింగ్ భాద్యతల్ని కూడా నిర్వహిస్తున్నారు.శ్రీచరణ్ పాకాల మ్యూజిక్ డైరెక్టర్.
అనిరుధ్ కృష్ణమూర్తి రైటర్గా, అర్జున్ సూరిశెట్టి ఆర్ట్ డైరెక్టర్ గా, రవి ఆంథోని ప్రొడక్షన్ డిజైనర్ గా వ్యవహరిస్తున్నారు.
ఎడ్ ఎంటర్టైన్మెంట్స్ CEOగా చరణ్తేజ్ ఉప్పలపాటి ఈ ప్రాజెక్ట్ మొత్తం ప్రొడక్షన్ పనులను నిర్వహిస్తున్నారు.ఈ ప్రాజెక్ట్తో పాటు ఈ ఏడాది మరో 2 ప్రాజెక్ట్లను రూపొందించేందుకు ఎడ్ ఎంటర్టైన్మెంట్స్ ప్లాన్ చేస్తోంది.
తారాగణం:
నిఖిల్ సిద్ధార్థ, ఐశ్వర్యా మీనన్
సాంకేతిక నిపుణులు:
దర్శకత్వం,ఎడిటర్: గ్యారీ బీహెచ్,నిర్మాత: కె రాజశేఖర్ రెడ్డి,సీఈఓ: చరణ్ తేజ్, సమర్పణ: ఎడ్ ఎంటర్టైన్మెంట్స్,రచయిత: అనిరుధ్ కృష్ణమూర్తి సంగీత దర్శకుడు: శ్రీచరణ్ పాకాల,DOP: జూలియన్ అమరు ఎస్ట్రాడా,ఆర్ట్ డైరెక్టర్: అర్జున్ సూరిశెట్టి,కాస్ట్యూమ్స్: రాగా రెడ్డి, అఖిల దాసరి ప్రొడక్షన్ డిజైనర్: రవి ఆంటోని,PRO: వంశీ-శేఖర్
.