మెడ నొప్పి.చాలా మందిని వేధించే సర్వ సాధారణమైన సమస్య ఇది.
ల్యాప్‌టాప్స్ ముందు గంటల తరబడి కూర్చుని పని చేయడం, అధికంగా ఫోన్ వినియోగించడం, ఆహారపు అలవాట్లు, పోషకాల కొరత, కుర్చునేటప్పుడు సరైన భంగిమను పాటించకపోవడం, ఒత్తిడి, వెన్నుముకకు ఏదైనా గాయం అవ్వడం వంటి రకరకాల కారణాల వల్ల మెడ నొప్పి తీవ్రంగా వేస్తుంటుంది.దాంతో ఆ నొప్పిని నివారించుకోవడం కోసం పెయిన్ కిల్లర్స్ వేసుకుంటారు.
కానీ, తరచూ పెయిన్ కిల్లర్స్ వేసుకోవడం ఆరోగ్యానికి ఏ మాత్రం మంచిది కాదు.
అందుకు సహజ పద్ధతుల్లోనే మెడ నొప్పిని తగ్గించుకునేందుకు ప్రయత్నించాలి.
అందుకు ఇప్పుడు చెప్పబోయే న్యాచురల్ పెయిన్ బామ్ అద్భుతంగా సహాయపడుతుంది.మరి ఆ పెయిన్ బామ్ ఏంటీ.? దాన్ని ఎలా తయారు చేసుకోవాలి.? వంటి విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.ముందుగా ఒక పండు మిర్చి తీసుకుని నీటితో శుభ్రంగా కడిగి మెత్తగా దంచుకోవాలి.

ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని వాటర్ హీట్ చేయాలి.వాటర్ హీట్ అవ్వగానే మరో గిన్నె పెట్టి.మూడు స్పూన్లు బీస్‌వ్యాక్స్ ముక్కలు, వన్ టేబుల్ స్పూన్ కొబ్బరి నూనె, దంచి పెట్టుకున్న పండు మిర్చి పేస్ట్ వేసి బాగా కలపాలి.
ఐదారు నిమిషాలు హీట్ చేస్తే బీస్‌వ్యాక్స్ బాగా కరిగిపోతుంది.అప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఈ మిశ్రమాన్ని పల్చటి వస్త్రం సాయంతో ఫిల్టర్ చేసుకుని.అర గంట పాటు వదిలేస్తే పెయిన్ బామ్ సిద్ధమైనట్టే.
మెడకు ఈ పెయిన్ బామ్‌ను అప్లై చేసి.
స్మూత్‌గా కాసేపు మసాజ్ చేసుకోవాలి.పావు గంట అనంతరం గోరు వెచ్చని నీటితో మెడను క్లీన్ చేసుకోవాలి.
ఇలా చేస్తే గనుక మెడ నొప్పి నుంచి క్షణాల్లో ఉపశమనం లభిస్తుంది.







