దాంపత్య జీవనంలో పెండ్లి అనేది కీలకమైన ఘట్టం.అనేక అనుభూతుల కలయికతో కూడుకుని ఉంటుంది.
అందుకే అటు ఏడుతరాలు.ఇటు ఏడు తరాలు చూసి పెండ్లి చేసుకోవాలని అంటుంటారు.
కొన్ని విషయాల్లో మాత్రం తమమాటే నెగ్గాలనుకుంటారు.ఇటీవల భార్యభర్తల మధ్య జరిగే అంతర్యుద్దం ఏదారికి తీస్తున్నాయో మనకు తెలుసు.
ఇవన్నీ పక్కనపెడితే పెండ్లి అనేది ఒక మధుర జ్ఞాపకంగా ఉండేందుకు తహతహలాడుతుంటారు.కొన్ని కావాలని చేసినా అలా కాలానుగుణంగా జరిగిపోయినా మదిలో జ్ఞాపకాలుగా మిగిలిపోతాయి.
పెండ్లి సమయంలోవధూవరుల మధ్య సరదా ఘటనలు జరుగుతుంటాయి.ఇలాంటి వీడియోలు అధికంగా సోషల్‌మీడియాలో దర్శనమిస్తుంటాయి.
ప్రస్తుతం ఇన్‌స్టాగ్రాంలో పోస్ట్ చేసిన ఓవీడియో తెగ వైరల్ అవుతోంది.
సోషల్ మీడియాలో పెండ్లికి సంబంధించిన వీడియోలలో కొన్ని ఫన్నీగా ఉంటే.
మరికొన్ని ఆశ్చర్యపరుస్తాయి.ఇటీవల వెడ్డింగ్ వీడయోలు తెగ వైరల్ అవుతున్నాయి.
ముఖ్యంగా డ్యన్సులు, తదితర సన్నివేశాలను నెటిజన్లను తెగ సంబురపరుస్తాయి.జనాలు కూడా ఇలాంటి వీడియోలనే ఇష్టపడుతుండడం విశేషం.
సరదాకోసమా ? పబ్లిసిటీ కోసమా ? అనేది పక్కన బెడితే వీడియోలు మాత్రం తెగ ఆకట్టుకుంటున్నాయి.భార్యభర్తల మధ్య అలకలు, గిలి్లకజ్జాలు నాలుగు గోడలకే పరిమితమవుతుంటాయి.
ఇందుకు సంబంధించిన వీడియోను మీరూ చూడాల్సిందే.
పెండ్లి వేడుక అతిథులు, బంధుమిత్రులతో సందడిగా మారుతుంది.
ఇది సాధారణ విషయమే.తాళి కట్టే ఘట్టం ముగిశాక వారంతా భోజనం చేసేందుకు సిద్ధమవుతారు.
ఈ సయమంలో వధూవరులు ఇద్దరు భోజనానికి కూర్చుంటారు.ఇద్దరి విస్తరిల్లో వివిధ ఆహార పదార్థాలు వడ్డిస్తారు.
ఇక భోజనం ఆరగించే సమయంలోమ వధువుకు తెలియకుండా ఆమె విస్తరిలోని పూరిని వరుడు తీసుకుంటాడు.వెంటనే అప్రమత్తమైన వధువు ఒకే ఒక రొమాంటిక్ లుక్ ఇస్తుంది.
దీంతో వరుడు ఆ పూరీని వధువు విస్తరిలోనే పెడతాడు.ఇలాంటి వేషాలే వద్దు అన్నట్టు వధువు చిరునవ్వు నవ్వుతుంది.
అయితే ఈ వీడియోలో నవవధువు రొమాంటిక్ సీయింగ్ తెగ ఆకర్షిస్తోంది.ఇది చూసిన నెటిజన్లు తెగ కామెంట్లు పెడుతున్నారు.
పెండ్లి మండపం నుంచే భర్తను కంట్రోల్ చేస్తోందంటూ కామెంట్లు పెడుతున్నారు.మీరు ఆ రొమాంటిక్ లుక్ చూడాలనుకుంటున్నారా ? అయితే ఈ వీడియో మీరూ చూడాల్సిందే.