రాజకీయాల్లో ఎప్పటికప్పుడు మార్పులు జరగడం సహజం.ఉన్నట్టుండి కొందరిని పదవులు వెతుక్కుంటూ వస్తాయి.
ఏపీ రాజకీయాల్లోనూ అదే జరుగుతోంది.ప్రస్తుతం వైసీపీ రాజ్యసభ టికెట్లపై ప్రతి రోజూ చర్చలు కొనసాగుతూనే ఉన్నాయి.
ఎవరూ ఎంతలా మాట్లాడుకున్నా ఫైనల్ చేయాల్సింది మాత్రం సీఎం జగనేనని చెబుతున్నాయి ఆ పార్టీ వర్గాలు.రాజ్యసభలో వైసీపీ చేతిలో నాలుగు స్థానాలు ఉన్నాయి.
అందులో ఎవరికి చాన్స్ దుక్కతుందనేదే ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది.ప్రతిసారీ సామాజిక రాజకీయ సమీకరణాలను అంచనా వేసుకుంటారు జగన్.
దాని ఆధారంగానే అభ్యర్థులను ఎంపిక చేస్తారు అని టాక్.జూన్ లో ఏపీ నుంచి ఉన్న నలుగురు రాజ్యసభ ఎంపీల పదవికాలం ముగియనుంది.
ఇందులో ముగ్గురు బీజేపీకి చెందిన వారు కాగా.మరొకరు వైసీపీ నేత విజయసాయిరెడ్డి.
ఇదిలా ఉండగా వీరిలో విజయసాయిరెడ్డిని అలాగే కొనసాగించాలని వైసీపీ భావిస్తోందట.ఆయన అదే పదవిలో కొనసాగుతారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
ఇక మిగితా మూడు సీట్లలో చర్చ మొదలైంది.ప్రతిసారీ బీసీలకు ప్రాధాన్యం ఇస్తున్న జగన్.
ఈ సారీ సైతం అందులో ఒక బీసీకి చాన్స్ ఇవ్వనున్నారని టాక్.టీడీపీలో చాలా కాలం పాటు పనిచేసి వైసీపీకి వచ్చిన నెల్లూరు కు చెందిన నేత బీద మస్తాన్ రావు.
బలమైన యాదవ సామాజిక వర్గానికి చెందిన నేత కావడంతో ఆయనకు సీట్ కన్ఫార్మ్ అని తెలుస్తోంది.
ఇక మిగతా రెండింటిలో ఒక స్థానాన్ని కమ్మ లేక ఎస్సీకి కేటాయించే చాన్స్ ఉంది.మరో స్థానాన్ని దేశంలోనే ధన వంతుల్లో ఒకరైన గౌతమ్ అదానీకి ఇవ్వబోతున్నారని టాక్.ఆయన ఢిల్లీలో ఉంటే మంచి ఉపయోగం ఉంటుందని వైసీపీ ఈ ఆఫర్ ఇస్తున్నట్టు సమాచారం.
మరి ఈ వార్తల్లో నిజం ఎంతుందో తెలియాలంటే జగన్ ఫైనల్ డెసిషన్ తీసుకునే వరకు ఆగాల్సిందే.