ఒరియాతో మ్యాగీ, ఫాంటతో ఆమ్లెట్ ఇలా ఎన్నో విచిత్రమైన స్ట్రీట్ ఫుడ్ కాంబినేషన్స్ సోషల్ మీడియాలో వైరలై మనందరినీ నోరెళ్ల బెట్టేలా చేసిన సంగతి తెలిసిందే.ఇప్పుడు తాజాగా మరో కొత్త వంటకం అందరి కళ్లు గింగరాలు తిరిగేలా చేస్తోంది.
నిజానికి ఇప్పటివరకు ఇలాంటి ఫుడ్ తయారు చేయాలనే ఆలోచన కూడా ఎవరూ చేసి ఉండరేమో! కానీ ఒక వ్యక్తి మాత్రం తాము చేసే ఎలాంటి ఫుడ్ అయినా జనాలు తింటారులే అన్న ఉద్దేశంతో ఓ చెత్త వంటకం తయారు చేశాడు.ఈ వంటకం టేస్ట్ చేసిన ఒక ఫుడ్ బ్లాగర్ యాక్, ఛీ అంటూ అక్కడి కక్కడే వాంతి చేసుకున్నంత పని చేసింది.
దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు ఇన్‌స్టాగ్రామ్ ని కుదిపేస్తోంది.
ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియోలో మనం ఒక వ్యక్తి ఒక బాక్స్ లో ఉన్న 10 గులాబ్ జామున్ లను పకోడీ పిండిలో ముంచడం చూడొచ్చు.
తర్వాత వాటిని సాధారణ పకోడీల్లాగా శనగ పిండిలో ముంచి వేడి నూనెలో డ్రాప్ చేయడం చూడొచ్చు.అలా వేడి వేడి నూనెలో గులాబ్ జామున్ తో పకోడీ తయారు చేసి విక్రయించడం కూడా గమనించవచ్చు.
ఈ నేపథ్యంలో ఈ స్ట్రీట్ సైడ్ ఫుడ్ ట్రై చేయడానికి భావన అనే ఒక ఫుడ్ బ్లాగర్ వచ్చింది.గులాబ్ జామున్ పకోడీ ఎంత రుచిగా ఉంటుందో అని ఆమె ఆబగా ఆవురావురుమంటూ తినేసింది.
కానీ సగం తినగానే రుచి వెగటుగా అనిపించడంతో యాక్ అన్నట్టు మిగతా సగం డస్ట్ బిన్ లో పారేసింది.తిన్నది కూడా ఆమె వాంతి చేసుకున్నట్లుగా తెలుస్తోంది.
ఆ తర్వాత ఈ వీడియోని ఢిల్లీ టమ్మీ అనే ఒక ఇన్‌స్టాగ్రామ్ ఖాతా షేర్ చేయగా.ఇప్పుడది వైరల్ గా మారింది.
దీన్ని చూసిన నెటిజన్లు రకాలుగా స్పందిస్తున్నారు.“గులాబ్ జామున్ ఇష్టపడే వారికి ఇది ఒక పీడకల లాగా కనిపిస్తుంది.గులాబ్ జామ్ తో ఇలాంటి చెత్త వంటకాలు చేయడం మానుకోండి.ఇలాంటి వంటకాలతో భయపెడితే ఇక మార్స్ కు వెళ్లిపోవాల్సిందే” అని కామెంట్లు పెడుతున్నారు.ఈ వెరైటీ వంటకం పై మీరూ ఓ లుక్కేయండి.