చర్మాన్ని తేమగా, మృదువుగా మెరిపించుకునేందుకు దాదాపు అందరూ ఎంతో ఖరీదైన సోప్స్‌ను వాడుతుంటారు.అయితే, ఎంత కాస్ట్లీ సబ్బును శరీరానికి యూజ్ చేసినా ఊహించినన్ని ఫలితాలు రాకపోవచ్చు.
కానీ, ఇప్పుడు చెప్పబోయే న్యాచురల్ బాత్ పౌడర్‌ను వాడితే గనుక శరీరాన్ని అద్దంలా మెరిపించుకోవచ్చు.మరి ఇంకెందుకు లేటు ఆ బాత్ పౌడర్ ఏంటీ.? దాన్ని ఎలా తయారు చేసుకోవాలి.? మరియు ఏ విధంగా వాడాలి.? వంటి విషయాలపై ఓ లుక్కేసేయండి.
ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో ఒక కప్పు ఎర్ర కందిప్పు, ఒక కప్పు శెనగపప్పు, ఒక కప్పు గోధుమలు, మూడు పచ్చి పసుపు కొమ్ములు, అర కప్పు నల్ల జీలకర్ర, పది బాదం పప్పులు వేసి కలుపుకోవాలి.
ఇప్పుడు వీటిని మిక్సీ జార్‌లో వేసి మెత్తటి పౌడర్‌లా చేసుకుంటే.సూపర్ న్యాచురల్ బాత్ పౌడర్ సిద్ధమైనట్టే.ఒక డబ్బాలో ఈ పౌడర్‌ను నింపుకుంటే.దాదాపు నెల రోజుల పాటు యూజ్ చేసుకోవచ్చు.
ఇక ఈ బాత్ పౌడర్‌ను ఎలా వాడాలో కూడా తెలుసుకుందాం పదండీ.
ఒక గిన్నెలో ఐదారు స్పూన్లు తయారు చేసుకున్న బాత్ పౌడర్, నాలుగైదు స్పూన్లు పచ్చి పాలు వేసుకుని మిక్స్ చేసుకోవాలి.ఇప్పుడు ఈ మిశ్రమాన్ని శరీరం మొత్తానికి పట్టించి.లైట్‌గా డ్రై అవ్వనివ్వాలి.
అనంతరం మెల్ల మెల్లగా స్క్రబ్ చేసుకుంటూ స్నానం చేయాలి.
సోప్‌కి బదులుగా ఈ బాత్ పౌడర్‌ను వాడితే గనుక చర్మంపై మురికి, మృత కణాలు తొలగిపోయి అద్దంలా అందంగా మృదువుగా మెరిసిపోతుంది.
స్కిన్ టోన్ పెరుగుతుంది.చర్మంపై ఏమైనా నల్లటి, తెల్లటి మచ్చలు ఉన్నా తగ్గు ముఖం పడతాయి.
మరియు ఈ బాత్ పౌడర్‌ను వాడితే వృద్ధాప్య ఛాయలు త్వరగా రాకుండా కూడా ఉంటాయి.