ఏపీ రాజకీయాల్లో ప్రస్తుతం ఎక్కువ మంది చర్చించుకుంటున్న అంశం ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయస్సు గురించే.ఉద్యోగస్తులు తమకు 40 శాతం పీఆర్సీ కావాలని డిమాండ్ చేశారు.
అందుకు కొన్ని పోరాటాలను కూడా చేశారు.కానీ ప్రభుత్వం మాత్రం చివరికి కేవలం 23 శాతం పీఆర్సీని మాత్రమే ప్రకటించింది.
ప్రభుత్వం ప్రకటించిన మరో వరం ఉద్యోగుల పదవీ విరమణ వయసు పెంపు.ఆ కోరికను ఉద్యోగ సంఘాల నాయకులు అస్సలు అడగనే లేదు.
కానీ ప్రభుత్వం మాత్రం వారికి అడగకుండానే వరం ఇచ్చింది.దీంతో కొంత మంది ఉద్యోగస్తులు ఆనందంలో తేలిపోతున్నారు.
కొంత మంది మాత్రం తెలంగాణలో జరిగిన విధంగానే ఇక్కడ కూడా జరుగుతుందని అంటున్నారు.అసలు తెలంగాణలో ఏం జరిగిందంటే.
కొన్ని రోజుల క్రితం తెలంగాణలోని కేసీఆర్ సర్కార్ కూడా ఉద్యోగుల పదవీ విరమణ వయస్సును పెంచుతూ నిర్ణయాన్ని ప్రకటించింది.ఉద్యోగస్తులు ఫుల్ ఖుషీ అయ్యారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటాలకు క్షీరాభిషేకాలు కూడా చేశారు.కానీ సీన్ కట్ చేస్తే నిరుద్యోగులు తమకు అన్యాయం జరగుతోందంటూ హై కోర్టు మెట్లెక్కారు.
ఏపీలో కూడా నిరుద్యోగులు కోర్టును ఆశ్రయిస్తారని కొంత మంది ఉద్యోగస్తులు భావిస్తున్నారు.
ఇలా నిరుద్యోగులు కోర్టును ఆశ్రయిస్తే తమకు నష్టం కలుగుతుందని ప్రస్తుతం పదవీ విరమణ వయస్సుని పెంచగా ఆనందపడుతున్న సీనియర్ ఉద్యోగస్తులు చెబుతున్నారు.ఒక వేళ నిరుద్యోగులు గెలిచిన తర్వాత ఉద్యోగాలు సంపాధించుకున్నా కూడా వారు ఎప్పటికీ జగన్ సర్కార్ కు యాంటీగానే ఉండే అవకాశం ఉంది.అంటే జగన్ నిర్ణయం వలన ఇంత జరగనుందా? అని అనేక మంది చర్చించుకుంటున్నారు.రిటైర్మెంట్ వయస్సుకు దగ్గర పడ్డ వారు ఇంకా రెండు సంవత్సరాల వరకు తమ జాబ్ కు ఎటువంటి ఢోకా లేదని భావిస్తున్నా తరుణంలో ఈ విషయం ప్రస్తుతం అందరినీ కలవరపెడుతోంది.