ప్రస్తుతం ప్లేబ్యాక్ సింగర్ గా ఎంతో మంచి క్రేజ్ సంపాదించుకొని ఎంతో మంది యువతను ఆకట్టుకుంటున్న వారిలో సిద్ శ్రీరామ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ప్రస్తుతం ఇండస్ట్రీలో ఈ సింగర్ కి ఎంతో క్రేజ్ ఉంది.
ఈ మధ్యకాలంలో సిద్ శ్రీరామ్ పాడిన ప్రతి ఒక్క పాట ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకోవడమే కాకుండా ఆ సినిమాకి మంచి పేరు తెచ్చి పెడుతున్నాయి.ఇలా ఎంతో మంచి క్రేజ్ సంపాదించుకున్న సిద్ శ్రీరామ్ ఇండస్ట్రీలో ఎంతో బిజీగా మారిపోయారు.
అంతేకాకుండా ఈయనకు భారీ డిమాండ్ కూడా పెరిగిపోయిందని చెప్పాలి.
ఇదిలా ఉండగా సిద్ శ్రీరామ్ లెజెండరీ డైరెక్టర్ మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కిన కడలి సినిమా ద్వారా వెండితెరకు పరిచయమయ్యారు.
ఈ విధంగా వెండితెర ఎంట్రీ ఇచ్చిన సిద్ శ్రీరామ్ మంచి ప్లే బ్యాక్ సింగర్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు.ఈ క్రమంలోనే ఈ యంగ్ హీరోకి ఇండస్ట్రీలో మరొక అద్భుతమైన అవకాశం వచ్చినట్లు టాలీవుడ్ సమాచారం.
కడలి సినిమా ద్వారా సింగర్ గా పరిచయమైన సిద్ శ్రీరామ్ మణిరత్నం దర్శకత్వంలో హీరోగా ఎంట్రీ ఇవ్వడానికి రంగం సిద్ధమైనట్లు తెలుస్తోందని టాలీవుడ్ టాక్.ఇప్పటికే మణిరత్నం సిద్ శ్రీరామ్ కి కథను వినిపించడంతో ఆ కథ తనకు బాగా నచ్చడం వల్ల హీరోగా చేయడానికి కూడా సానుకూలంగా ఉన్నట్లు తెలుస్తోంది.అయితే ఈ సినిమాకి సంబంధించిన పూర్తి వివరాలు అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.