విశాఖ న‌డిబొడ్డున వైసీపీకి చెక్ పెడుతున్న టీడీపీ స‌రికొత్త వ్యూహం

ఏపీ రాజకీయాల్లో ఎదురంటూ లేకుండా దూసుకుపోతున్న వైసీపీకి ఒక విషయంలో మాత్రం అసంతృప్తి అలాగే ఉంది.అదే విశాఖ నడిబొడ్డున ఉన్న విశాఖ సౌత్ సీటు నుంచి ఆ పార్టీ ఇప్పటికీ గెలవలేకపోయింది.

 The Tdp Latest Strategy Is To Check The Ycp In Visakhapatnam Details, Tdp, Ap Po-TeluguStop.com

ఎలాగైనా సరే గెలిచేందుకు ఎన్ని ప్రయత్నాలు చేసినా కానీ జెండా మాత్రం ఎగరలేదు.దీంతో ఢీలా పడ్డ వైసీపీ నేతలు అక్కడి నుంచి టీడీపీ జెండా మీద గెలిచిన గణేశ్ కి వైసీపీ కండువా కప్పారు.ఇక 2024 ఎన్నికల్లో గెలుపు తమదే అని అనుకుంటున్న తరుణంలో టీడీపీ చేసిన ఓ పని ఇప్పుడు వైసీపీకి గెలుపు మీద మరోమారు ఆశలు సన్నగిల్లేలా చేసింది.2004లో పరవాడ నుంచి కాంగ్రెస్ ఎమ్మెల్యేగా గెలిచిన గండి బాబ్జీని తీసుకొచ్చి టీడీపీ విశాఖ సౌత్ నియోజకవర్గానికి ఇంచార్జ్ ని చేసింది.2024లో అన్నీ కుదిరితే టీడీపీ నుంచి బాబ్జీ పోటీ చేయడం కూడా ఖాయమని తమ్ముళ్లు చెబుతున్నారు.

ఇదే కనుక జరిగితే వైసీపీకి గెలుపు మీద మరోసారి అనుమానం కలగక మానదు.

ప్రస్తుతం ఉన్న వైసీపీ ఎమ్మెల్యే గణేశ్ కు లోకల్ వైసీపీ నాయకులకు పడడం లేదు.వారు వచ్చే ఎన్నికల్లో గణేశ్ కు సాయం చేస్తారా?లేదా? అన్నది అనుమానమే.ఇటువంటి తరుణంలో టీడీపీ నుంచి బలమైన క్యాండిటేట్ అయిన గండి బాబ్జీ పోటీ చేస్తే గెలుపు సంగతి ఎలా అని వైసీపీ ఆలోచిస్తోంది.

Telugu Ap, Chandrabbau, Jagan, Tdp Gandi Babji, Tdp, Vishaka Seat, Vishakapatnam

గండి బాబ్జీకి 2004లో ఎమ్మెల్యేగా చేసిన అనుభవం ఉంది.తర్వాత జరిగిన నియోజకవర్గాల పునర్విభజనలో ఆయన నియోజకవర్గం మాయం కావడంతో బాబ్జీ అప్పటి నుంచి ఇప్పటిదాకా గెలుపు రుచి చూడలేకపోయారు.2014లో ఆయన వైసీపీ కండువా కప్పుకున్న కానీ వైసీపీ అధిష్టానం బాబ్జీకి టికెట్ ఇవ్వలేదు.దీంతో రగిలిపోయిన బాబ్జీ టీడీపీలో జాయిన్ అయ్యారు.2024లో విశాఖ సౌత్ నుంచి పోటీ చేసేందుకు మొగ్గు చూపుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube