టాలీవుడ్ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీ బిజీగా ఉన్నాడు.
అయితే కేవలం నటుడిగానే కాకుండా కథలు రాయడంలో, దర్శకత్వం వహించడంలో, పాటలు పాడడంలో, ఫైట్ ను కంపోజ్ చేయడంలో ఇలా మరెన్నో టాలెంట్స్ తో ఎంతో మంది ప్రేక్షకుల మనసులలో స్థానం సంపాదించుకున్నారు. పవన్ కళ్యాణ్ పాటలు పాడారు అంటే ఇక ఆడియన్స్ కేరింతలు కొట్టాల్సిందే.
ఇప్పటివరకు పవర్ స్టార్ దాదాపుగా 9 పాటలు పాడారు.అందులో ఒకటి, రెండు పాటలు తప్ప మిగిలిన పాటలు అన్ని సూపర్ హిట్ అయ్యాయి.
ఇది ఇలా ఉంటే తాజాగా పవన్ కళ్యాణ్ మరొకసారి తన గొంతును సవరించుకోబుతున్నారనే వార్తలు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి.ప్రస్తుతం పవన్ కళ్యాణ్ నటిస్తున్న భీమ్లా నాయక్ సినిమాలో పాట పాడబోతున్నారట.
సంగీత దర్శకుడు తమన్ పవన్ కళ్యాణ్ తో పాటలు పాడించే ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.మరి పవన్ అందకు సిద్ధంగా వున్నారా లేదా అన్నది తెలియాల్సి ఉంది.
ఇకపోతే పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్ సినిమా నుంచి విడుదలైన పాటలకు ప్రేక్షకుల నుంచి భారీగా స్పందన లభించింది.
![Telugu Bheemla Nayak, Pawan Kalyan, Rana, Tollywood-Movie Telugu Bheemla Nayak, Pawan Kalyan, Rana, Tollywood-Movie]( https://telugustop.com/wp-content/uploads/2021/12/adavi-thalli-durgavva-tollywood-pawan-kalyan-rana-nithya-menon-1.jpg)
ఈ సినిమాలోని లాలా భీమ్లా,టైటిల్ సాంగ్ విడుదల అయ్యి ఎంతగా అలరించాయో అందరికీ తెలిసిందే.ఇక భీమ్లా నాయక్ సినిమాలో పవన్ పాటలు పాడతారా లేదా అన్న విషయం గురించి మేకర్స్ నుంచి క్లారిటీ రాలేదు. సాగర్.
కె.చంద్ర దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి త్రివిక్రమ్ మాటలు, స్ర్కీన్‌ప్లే అందిస్తున్నారు.సితారా ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థ నిర్మిస్తోంది.జనవరి 12న ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు.