బాలకృష్ణ నటిస్తున్న ఎన్ఠీఆర్ బయోపిక్ ఈ సంక్రాంతికి ప్రేక్షకులముందుకు రానున్న సంగతి అందరికి తెలిసిందే.ఇది ఇలా ఉండగా స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారి రెండోవ భార్య లక్ష్మి పార్వతి గారి గురించి గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో చర్చ నడుస్తుంది.
లక్ష్మిపార్వతి మొదటి భర్త ఎవరు అనే డౌట్ చాలా మందికి వచ్చింది.
లక్ష్మిపార్వతి మొదటి భర్త వీర గంధం వెంకట సుబ్బారావు.
లక్ష్మీపార్వతి చేత సంస్కృతం లో MA చేయించారు.ఎం ఫిల్ కూడా చేయించారు.
నిజానికి వీరగంధం చదివింది 8వ క్లాస్ అయినప్పటికీ బహుముఖ ప్రజ్ఞాశాలి.తెలుగు,ఇంగ్లీషు బాగా మాట్లాడగల దిట్ట.హరికథల్లో బాగా రాణించి అంతర్జాతీయ ఖ్యాతి గాంచిన వీరగంధం తాను ఎక్కడ హరికథ చెప్పినా అక్కడ ముందుగా హిందూ మత సంప్రదాయాలపై భార్య చేత ప్రసంగాలు చేయించేవారు.1979లో అమెరికాలో హరికథ చెప్పి ,విదేశాల్లో వ్యాప్తి చేసిన ఘనత ఈయనది.
కానీ తర్వాత లక్ష్మి పార్వతి గారి వల్ల ఆయనకు అన్యాయం జరిగింది.ఎన్నో అవమానాలు ఎదురుకోవాల్సి వచ్చింది.న్యూయార్క్ ఆంధ్ర సభలకు రాజకీయ,సినీ ప్రముఖులతో పాటు వీరగంధం వెంకట సుబ్బారావుకి కూడా ఇన్విటేషన్ వచ్చింది.అయితే ఇది పంపింది స్వయంగా అక్కినేని నాగేశ్వరరావు.టీవీల్లో ,రేడియోల్లో వీరగంధం హరికథలు విని ఆంధ్రాలో హరికథ చెప్పాలంటే వీరగంధం ఒక్కరే అని అక్కినేని అనేవారట.అందుకే ఆంధ్ర మహాసభలకు ఆహ్వానించారు.
పివి నరసింహారావు, అక్కినేని,జె బాపినీడు,డాక్టర్ దాసరి వంటి ప్రముఖులు వెళ్లారు.వీసా కారణంగా వారితో అమెరికా వెళ్లలేకపోయిన వీరగంధం వెనకాల విమానంలో వెళ్లారు.నాగార్జున స్వయంగా ఎయిర్ పోర్టుకి వచ్చి సభలకు తీసుకెళ్లారు.తిరిగి ఇండియా తిరిగొచ్చేవరకూ వీరగంధం ను అక్కినేని,నాగార్జున చక్కగా చూసుకున్నారు.
అలాగే 1985 వరకూ ప్రతియేటా హరికథ చెప్పడానికి అమెరికా వెళ్లేవారు.చివరి సారిగా లక్ష్మి పార్వతిని కూడా తీసుకెళ్లారు.అప్పుడే సుబ్బారావు గురించి ఎన్టీఆర్ కి తెలిసి సతీసమేతంగా ఆహ్వానించి, సన్మానించారు.అప్పటినుండి లక్ష్మి పార్వతి ఎన్ఠీఆర్ లైఫ్ లో కి ఎంటర్ అయ్యారు.ఆ తర్వాత ఏమైందో అందరికి తెలిసిందే.