మా ఎన్నికలు ముగిసి పది రోజులవుతున్న ఇంకా మా సభ్యుల మధ్య గొడవలు చెలరేగుతూనే ఉన్నాయి.ఎన్నికలు ముగిసిన వీరి మాటల యుద్ధం మాత్రం ముగియడం లేదు.
ఇప్పటికే ప్రకాష్ రాజ్ ప్యానల్ సభ్యులు మంచు విష్ణు పై.మంచు విష్ణు ప్రకాష్ రాజ్ పై విమర్శలు చేసుకుంటున్నారు.ఈ నేపథ్యంలో తాజాగా అనసూయ చేసిన పోస్ట్ వైరల్ అయ్యింది.
ఇటీవలే సీనియర్ నటుడు కోటా శ్రీనివాస్ రావు ఒక ఇంటర్వ్యూ లో అనసూయపై కామెంట్స్ చేసారు.
ఆ ఇంటర్వ్యూ లో కోటా అనసూయ నటనని, డాన్స్ ను మెచ్చుకున్నారు.అలాగే అనసూయ డెస్సింగ్ పై కామెంట్ చేసారు.ఈ వ్యాఖ్యలపై అనసూయ సీరియస్ పోస్ట్ పెట్టింది.కోటా పేరు చెప్పకుండా ఈ విషయంపై సీనియర్ నటులు అంటూ ట్విట్టర్ లో ఒక పోస్ట్ ను షేర్ చేసింది.
ఎవరికీ నచ్చిన బట్టలను వాళ్ళు వేసుకుంటారు అది వారి పర్సనల్.బట్టలపై కామెంట్ చేయడం సరికాదని అనసూయ తన పోస్ట్ ద్వారా తెలిపింది.అయితే ఈ పోస్ట్ ప్రెసెంట్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.అనసూయ పెట్టిన పోస్ట్ పై నెటిజెన్స్ ఆమెను భారీగా ట్రోల్ చేస్తున్నారు.
అనసూయ పెట్టిన పోస్ట్ కు చాలా మంది స్పందిస్తున్నారు.కోటా గారు నీ డాన్స్, యాక్టింగ్ బాగుంటుందని చెప్పిన విషయాలు వదిలేసి కేవలం ఆ పదం పట్టుకుని ఎందుకు ప్రశ్నించారు అని అడుగు తున్నారు.
ఇంకొంతమంది తండ్రి వయసులో ఉన్న వ్యక్తి పిల్లలకు మంచి బట్టలు వేసుకోమనడం తప్పా.అని ప్రశ్నిస్తున్నారు.
మీరు అంత అసభ్యంగా ఉన్న ఫోటోలు పెడితేనే ఇలాంటి నెగిటివ్ కామెంట్స్ వస్తాయి.మీరు పిక్స్ పెట్టినప్పుడు కామెంట్స్ కూడా తీసుకోవాలి అని మరి కొంతమంది తమ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
ఇక ఇప్పుడు మరొక వాదన కూడా తెరమీదకు వచ్చింది.జబర్దస్త్ లో డ్రెస్సింగ్ గురించి హైపర్ ఆది, అభి లాంటి వారు కామెంట్స్ చేసినప్పుడు ఎంజాయ్ చేసి ఇప్పుడు కోటా మాట్లాడినప్పుడు మాత్రం ఎందుకు నెగిటివ్ తీసుకున్నారు అని ప్రశ్నిస్తున్నారు.
ఈ విషయంపై అనసూయ మీద నెగిటివ్ కామెంట్స్ ఎక్కువ అవుతున్నాయి.చాలా మంది కోటా శ్రీనివాసరావు నే సమర్థిస్తున్నారు.