టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం వరుస సినిమాలతో బాగా బిజీగా ఉన్నాడు.యంగ్ హీరోలతో పోటీగా దూసుకుపోతున్నాడు.
ఇప్పటికే బోయపాటి శ్రీను దర్శకత్వంలో అఖండ సినిమాలో నటించగా ఈ సినిమా త్వరలోనే విడుదల కానుంది.ఇందులో బాలీవుడ్ బ్యూటీ ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్ గా నటించిన సంగతి తెలిసిందే.
ఇదిలా ఉంటే ఈయన నటించే మరో సినిమాలో ఈయన కోసం ఓ హీరోయిన్ బరువు పెరుగనుంది.ఇంతకీ ఆమె ఎవరో కాదు.
టాలీవుడ్ బ్యూటీ స్టార్ హీరోయిన్ త్రిష.అఖండ సినిమా తర్వాత గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నాడు బాలయ్య.ఈ సినిమాలో త్రిష హీరోయిన్ గా నటిస్తుంది.ఫుల్ యాక్షన్ ఎంటర్టైన్మెంట్ తో తెరకెక్కనుంది ఈ సినిమా.
ఇక ఇందులో త్రిష భార్య పాత్రలో నటించనుంది.కాబట్టి ఈ పాత్రలో కాస్త బరువు ఉండాలని దర్శకుడు కోరడంతో.
త్రిష ప్రస్తుతం తన శరీర బరువుని పెంచుకోవడానికి ప్రయత్నాలు చేస్తుంది.ఈ సినిమాలో బాలయ్య రెండు పాత్రలలో కనిపించనున్నట్లు గతంలో వార్తలు వినిపించాయి.
ఈ సినిమా తర్వాత అనిల్ రావిపూడి దర్శకత్వంలో మరో సినిమా చేయడానికి సిద్ధంగా ఉన్నాడు.ఈ సినిమా కూడా యాక్షన్ నేపథ్యంలో తెరకెక్కనుంది.ఇవే కాకుండా వెంకీ అట్లూరి దర్శకత్వంలో కూడా ఓ సినిమాను ఫిక్స్ చేశాడు.ఈ సినిమా పల్లెటూరు బ్యాక్ డ్రాప్ నేపథ్యంలో తెరకెక్కనుంది.ఇటీవలే మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై ఓ సినిమాను దిల్ రాజు బ్యానర్ పై మరో సినిమాను చేయనున్నట్లు వార్తలు వినిపించాయి.ఇక దీంతో బాలయ్య అభిమానులు బాలయ్య సినిమాల కోసం తెగ ఎదురుచూస్తున్నారు.
ఈ ఏడాది అక్టోబర్ లో అఖండ సినిమా విడుదల కానున్న సంగతి తెలిసిందే.