మోసగాళ్లకు మోసగాడు సినిమాను మహేష్ ఎందుకు చేయనన్నాడో మీకు తెలుసా?

టాలీవుడ్ హీరోలలో రీమేక్ లకు దూరంగా ఉండే హీరోలలో మహేష్ బాబు ఒకరు.మహేష్ బాబు స్ట్రెయిట్ సినిమాలతోనే బ్లాక్ బస్టర్ హిట్లతో పాటు ఇండస్ట్రీ హిట్లను సాధించారు.

 Super Star Krishna On Mosagallaku Mosagadu Movie Remake, Classic Movie, Mosagall-TeluguStop.com

వరుసగా హ్యాట్రిక్ హిట్లను సొంతం చేసుకున్న మహేష్ బాబు సర్కారు వారి పాటపై ప్రస్తుతం ఫుల్ గా ఫోకస్ పెట్టి ఆ సినిమాతో విజయాన్ని అందుకుంటానని భావిస్తున్నారు.మహేష్ తరువాత సినిమాలకు కూడా త్రివిక్రమ్ శ్రీనివాస్, రాజమౌళి దర్శకత్వం వహిస్తున్నారు.

మహేష్ తరువాత రెండు సినిమాలు పాన్ ఇండియా సినిమాలు కాగా రాజమౌళి సినిమా కోసమే మహేష్ ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తుండటంతో పాటు ఈ సినిమాకు సంబంధించిన అప్ డేట్ ఏదైనా వస్తుందేమోనని భావిస్తున్నారు.కృష్ణ, మహేష్ బాబు అభిమానులలో చాలామంది మహేష్ బాబు మోసగాళ్లకు మోసగాడు రీమేక్ లో నటిస్తే బాగుంటుందని భావించారు.

గుడ్ బ్యాడ్ అగ్లీ సినిమా చూసి అలాంటి సినిమాలో నటించాలని అనుకున్నానని కృష్ణ అన్నారు.

సినిమాకు మోసగాళ్లకు మోసగాడు అనే టైటిల్ పెడితే బాగుంటుందని సూచించానని కృష్ణ అన్నారు.

Telugu Classic, Classic Krishna, Cowboy, Krishna, Mahesh Babu, Tollywood, Vijaya

ఆ సినిమా కోసం హార్స్ రైడింగ్ ట్రైనింగ్ తీసుకోవాల్సి వచ్చిందని కృష్ణ తెలిపారు.విజయనిర్మల బూట్లు లేకుండా ఆ సినిమాలో నటించారని ఎంతో రిస్క్ చేసి ఆ సినిమా తీశామని కృష్ణ వెల్లడించారు.చిన్నప్పుడు సొంతంగా తీసిన అన్ని సినిమాల్లో నటించారని కృష్ణ తెలిపారు.

Telugu Classic, Classic Krishna, Cowboy, Krishna, Mahesh Babu, Tollywood, Vijaya

మోసగాళ్లకు మోసగాడు తప్ప కౌబాయ్ సినిమా ఏదీ హిట్ కాలేదని కృష్ణ వెల్లడించారు.మోసగాళ్లకు మోసగాడు క్లాసిక్ అని అందువల్ల ఆ సినిమా రీమేక్ లో నటించనని మహేష్ బాబు చెప్పాడని కృష్ణ చెప్పుకొచ్చారు.మహేష్ బాబు మోసగాళ్లకు మోసగాడు సినిమాలో నటించే ఛాన్స్ లేదని కృష్ణ వెల్లడించారు.

అయితే మహేష్ ఫ్యాన్స్ మాత్రం మహేష్ మోసగాళ్లకు మోసగాడు రీమేక్ లో నటిస్తే బాగుంటుందని భావిస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube