అమెరికాలో భారతీయుడికి నాలుగేళ్ల జైలు శిక్ష...చేసిన నేరం తెలిస్తే ఛీ అంటారు...!!

ఊరు కాని ఊరు వెళ్తేనే మనం ఒళ్ళు దగ్గరపెట్టుకుని ఉంటాం.అక్కడ మన వల్ల ఎలాంటి నష్టం జరిగినా అది మనకు మన కుటుంభానికి ఎంతో అవమానంగా భావిస్తాం.

 Million Dollars Investment Fraud Manish Sing In Usa , America, Indians, Manish S-TeluguStop.com

అలాంటిది దేశం కాని దేశం వెళ్తే ఇంకెంత జాగ్రత్తగా ఉండాలి.అక్కడ ఎలాంటి తప్పు మన వలన జరిగినా వ్యక్తిగా కంటే భారతీయుడిగా మోసం చేసినట్టుగానే ఉంటుంది.

అయితే విదేశాలలో భారత దేశ గౌరవాన్ని అగ్రస్థానంలో ఉంచుతున్న భారతీయులు ఎంతో మంది ఉన్నారు అలాగే భారత్ పరువు తీస్తున్న వాళ్ళు లేకపోలేదు.నమ్మితే ప్రాణాలు ఇచ్చే గొప్ప విలువలు ఉన్న భారతీయులను నమ్మక ద్రోహం చేసే ద్రోహులుగా ముద్రపడేలా ఉంటున్నాయి కొందరి చర్యలు.

తాజాగా అమెరికాలో ఓ భారతీయుడు అమెరికన్ జంటను మోసం చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. మనీష్ సింగ్ అనే ఇండో అమెరికన్ వాషింగ్టన్ లో ఉంటున్నాడు.

మాటలతో ఎదుటి వారిని మెస్మరైజ్ చేయడంలో మనీషి దిట్ట.తాను ఓ భారీ ప్రాజెక్ట్ చేపడుతున్నానని అయితే తనవద్ద అంత డబ్బులేదని ఫ్యాబ్రిక్ కంపెనీ లో నాకు అపారమైన అనుభవం ఉందని నమ్మించాడు.కంపెనీ డెవలప్మెంట్ తాను చూసుకుంటాను మీరు పెట్టుబడి పెట్టండని చెప్పడంతో ఆశపడిన ఆ జంట అందుకు అంగీకరించి డబ్బు అడిగినప్పుడల్లా ఇస్తూ దాదాపు రూ.9 కోట్లు మనీష్ చేతిలో పెట్టింది.

అయితే సదరు జంట నుంచీ డబ్బులు తీసుకున్న తరువాత కంపెనీ కోసం రూపాయి కూడా ఖర్చు చేయలేదు.కంపెనీ కు సంభందించిన ఫ్యాబ్రిక్ మెటీరియల్ భారత్ లో తయారవుతోందని అయితే కొంత సమయం పడుతుందని నమ్మించాడు.

నెలలు గడుస్తున్నా ఎలాంటి డెవలప్మెంట్ ఉండక పోవడంతో సదరు జంట మనీష్ పై దృష్టి పెట్టింది.మనీష్ తన దగ్గర ఉన్న డబ్బుతో జల్సాలు చేస్తూ సరదాగా తిరుగుతున్నాడని, ఆన్లైన్ లో పోర్న్ గ్రఫీ చూస్తున్నాడని వీళ్ళు ఇచ్చిన డబ్బులు మొత్తం విలాసాలకు తగలేశాడని తెలుసుకుని షాక్ అయ్యారు.

దాంతో వాళ్ళు పోలీసులను ఆశ్రయించడంతో మనీష్ పై కేసు నమోదు చేసి కోర్టు ముందు హాజరుపరిచారు.మనీష్ మోసం చేశాడని నమ్మిన కోర్టు అతడికి నాలుగేళ్ల జైలు శిక్షను విధించింది.

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube