సాధారణంగా పెద్దవారు అయినా తర్వాత మతిమరుపు సమస్య వస్తుంది.అయినా కూడా వారు పూర్తిగా అయితే మర్చిపోరు.
చిన్న విషయాలు కానీ.వస్తువులు ఎక్కడ పెట్టారో గుర్తు లేక పోవడం వంటి సాధారమైన విషయాలు మాత్రమే మర్చిపోతారు.
కానీ ఒక వ్యక్తి మాత్రం ఏకంగా 20 ఏళ్ల జీవితాన్ని మర్చిపోయాడు.రాత్రి నిద్ర పోయిన ఆ వ్యక్తి ఉదయాన్నే నిద్ర లేచే సమయానికే గతం మర్చిపోయాడు.
తనకు పెళ్లి అయినా విషయం ఒక కూతురు ఉన్న విషయం కూడా మర్చిపోయాడు.అతడికి 37 సంవత్సరాలు అయితే.నిద్ర లేచిన తర్వాత 16 సంవత్సరాలుగా ఫీల్ అయ్యి 20 ఏళ్ల గతాన్ని మర్చి పోయాడు.ఈ ఘటన అమెరికాలో జరిగింది.
అతడి పేరు డానియల్ పోర్టర్.రోజు లాగే నిద్ర పోయిన అతడు ఆ రోజు ఉదయాన్నే నిద్ర లేవగానే గతమంతా మర్చిపోయాడు.
తనకు 16 సంవత్సరాలు అనే ఫీలింగ్ లోనే ఉండిపోయాడు.
అడ్డాలో చూసుకుని నేను ఇంత లావు ఉన్నానేంటి.ఓల్డ్ గా కూడా అయ్యాను.అని అరిచాడు.
అతడి భార్య మనకు పెళ్లి జరిగిందని చెప్పిన వినలేదు.అతడు గతాన్ని మర్చి పోవడంతో ఇంట్లో నుండి పారిపోవడానికి ప్రయత్నించాడని ఆమె భార్య తెలిపింది.
తను కిడ్నప్ అయ్యానని భావించాడని.ఎంత చెప్పిన వినలేదని ఆమె తెలిపింది.
అతడి మానసిక పరిస్థితి చూసి అతడిని వెంటనే హాస్పిటల్ కు తీసుకువెళ్ళమని అతడిని పరీక్షించిన వైద్యులు అతడు షార్ట్ టర్మ్ మెమరీలాస్ తో బాధ పడుతున్నట్టు తెలిపారని ఆమె భార్య వెల్లడించింది.అతడు 24 గంటల్లోనే మాములుగా అవుతాడని చెప్పిన ఇప్పటికి 6 నెలలు గడిచింది.ఇప్పుడిప్పుడే గతం కొద్దీ కొద్దిగా గుర్తుకు వస్తుందని.ప్రస్తుతం థెరపీ ట్రీట్మెంట్ తీసుకుంటున్నట్టు తెలిపింది.మొత్తానికి అతడు తన 20 ఏళ్ల గతాన్ని మర్చిపోయాడు.