ప్రముఖ సినీ గాయకుడు, సంగీత దర్శకుడు విజయ్ ప్రకాష్ పరిచయం గురించి అందరికీ తెలిసిందే.తన పాటలతో ఎంతోమందిని ఆకట్టుకున్నాడు.
తెలుగు, కన్నడ, తమిళ, మలయాళ, మరాఠీ, హిందీ సినిమాలలో ఎన్నో పాటలు పాడి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.అంతేకాకుండా తన సంగీతానికి అవార్డులను కూడా సొంతం చేసుకున్నాడు.
సినిమా పాటలే కాకుండా భక్తి పాటలు కూడా పాడాడు.ఇదిలా ఉండగా తనకు ఓ విషయంలో భయమేసిందట.
దాదాపు ఐదు వేల పాటలు పాడిన విజయ్ ప్రకాష్ ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నాడు.ఇక జయహో పాట మధ్యలో జయహో అంటూ పాడిన గొంతు విజయ్ ప్రకాష్ ఇదే.తాజాగా ఈయన తన భార్య మహతితో ఈటీవీలో ప్రసారమవుతున్న ఆలీతో సరదాగా షోలో పాల్గొన్నారు.ఇక ఈ ఎపిసోడ్ మొత్తం చాలా సరదాగా సాగింది.
అంతేకాకుండా కొన్ని పాటలు కూడా వినిపించాడు విజయ్ ప్రకాష్.
ఇక తన భార్యతో మొదటి పరిచయం ఎలా జరిగిందో తెలిపాడు.మహిత కూడా డబ్బింగ్ ఆర్టిస్ట్ గా మంచి గుర్తింపు తెచ్చుకుంది.ఇక ఆమె ఆ కాలంలోనే కేవలం మూడు రోజులకే అతనితో ప్రేమలో పడిందట.
అది కూడా తనను ఓ హోటల్ కు తీసుకెళ్లి తనతో ముఖం ముందు ప్రపోజ్ చేయక ఏవో మాటలు మాట్లాడే సరికి అసలు కథ ఏంటి నేనంటే ఇష్టమా అని నేరుగా అడిగేసిందట మహతి.ఇక దాంతో విజయ్ ప్రకాష్ నాకు ఇష్టమే ఎస్ అని చెప్తావా అని ప్రశ్నించడంతో.
మహతి కూడా ఎస్ అనేసిందట.
ఇక విజయ్ ప్రకాష్ అలా నేరుగా చెప్పడం వల్ల కాస్త ఇబ్బందిగా ఉండేదని.ఏమైనా జరిగితే బాధేస్తుందని అలా తిప్పితిప్పి అడిగాడట.ఒకవేళ తను ఎక్కడ నో అంటుందో అని చాలా భయం వేసిందట.
ఇక అలా తన వ్యక్తిగత విషయాల గురించి తెలుపుతూ కొందరు నటుల విషయాలను కూడా పంచుకున్నారు.ఇక విజయ్ ప్రకాష్ తన చిన్నప్పుడు ఇల్లు వదిలి వెళ్లిన విషయాలను కూడా పంచుకున్నాడు.