కరోనా.భారతదేశాన్నే కాదు ప్రపంచాన్ని అతలాకుతలం చేసిన వైరస్.ప్రస్తుతం కూడా ప్రపంచ దేశాలను వణికిస్తున్న మహమ్మారి.మన దేశంలో కరోనా కేసులు ఇప్పుడిప్పుడే తగ్గుతున్నాయి.సెకండ్ వేవ్ నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటూ.అన్లాక్ డౌన్ ప్రక్రియ మొదలుపెడుతున్నాం.
అయితే అన్లాక్డౌన్ మొదలైనంత మాత్రాన.కరోనా వెళ్లిపోయినట్టు కాదు కదా.కేవలం దేశ ప్రజల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వాలు సడలింపులు ఇస్తున్నాయి.కానీ కరోనా నిబంధనలైన భౌతిక దూరం పాటించడం, మాస్కులు ధరించడం, చేతులు తరచూ కడుక్కోవడం, సానిటైజ్ చేసుకోవడం చేయాలని, గుంపులు గుంపులుగా ఉండకూడదని ప్రభుత్వాలు హెచ్చరిస్తూనే ఉన్నాయి.
కానీ ప్రభుత్వం ఇచ్చిన సడలింపులను కొందరు మిస్ యూస్ చేస్తున్నారు.తాత్కాలిక ఆనందాల కోసం ప్రమాదాలను కొనితెచ్చుకుంటున్నారు.
తమిళనాడులోని విళరీపట్టి గ్రామస్తులు చేపలు కోసం ఎగబడ్డారు.కరోనా నిబంధనలు గాలికొదిలేశారు.
ఒక్కరూ మాస్కులు ధరించలేదు.భౌతికదూరం పాటించలేదు.
తామంటే తామంటూ చేపల కోసం పోటీ పడ్డారు.దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
విళరీపట్టి గ్రామస్తులే కాకుండా చుట్టు పక్కల గ్రామాల నుంచి అధిక సంఖ్యలో ప్రజలు తరళివచ్చారు.చేపల కోసం పెద్ద ఫైటే చేశారు.
![Telugu Fish, Thamilnadu-Latest News - Telugu Telugu Fish, Thamilnadu-Latest News - Telugu](https://telugustop.com/wp-content/uploads/2021/07/fish-thamilnadu.jpg )
చేపలు తినకపోతే బతకలేము అనుకున్నారో ఏమో.ఎగబడి మరీ చేపలు పట్టడం ఆ వీడియోలో స్పష్టంగా కనిపిస్తున్నాయి.కరోనా కరాళ నృత్యం చేస్తున్న సమయంలో ఇలాంటి చర్యలు ఏంటని ఈ వీడియో చూసిన నెటిజన్లు మండిపడుతున్నారు.మొన్నటి వరకు కరోనా కేసులు, మరణాలు ఎన్ని సంభవించాయో ఒక సారి గుర్తు చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
ఇప్పుడిప్పుడే కరోనా సెకండ్ వేవ్ తగ్గిపోతోందని, ఇలాంటి చర్యల వల్ల అది మళ్లీ పెరిగే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.ఇప్పటికైనా ఇలాంటి పిచ్చి చర్యలు చేయకండని సూచించారు.