గత ఏడాది కరోనా లాక్ డౌన్ కారణంగా సినిమా ఇండస్ట్రీ దాదాపుగా ఆరు నెలల పాటు పాక్షికంగా మూత పడ్డట్లుగా మారిపోయింది.షూటింగ్ లు జరగడానికి ఆరు నెలల సమయం పడితే థియేటర్లు ఓపెన్ అవ్వడానికి దాదాపుగా 10 నెలల సమయం పట్టింది.
థియేటర్లు రెండు మూడు నెలలు నడిచాయో లేదో అప్పుడే థర్డ్ వేవ్ వచ్చేసింది.షూటింగ్ లు లేక పోవడం వల్ల సినీ కార్మికులు అల్లాడుతున్నారు.
ఈ నేపథ్యంలో ఇండస్ట్రీ వర్గాల వారు కీలక నిర్ణయానికి వచ్చారు.విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం వచ్చే వారం నుండి చిన్న పెద్ద సినిమా ల చిత్రీకరణ పునః ప్రారంభించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.
పెద్ద మొత్తంలో షూటింగ్ లు నిర్వహించకున్నా కూడా ఒక మోస్తరుగా ప్రభుత్వం విధించిన లాక్ డౌన్ నిబంధనలకు అనుగుణంగా మద్యాహ్నం వరకు షూటింగ్ లను జరిపేందుకు నిర్ణయించినట్లుగా చెబుతున్నారు.
ఈనెలలో షూటింగ్ లు పునః ప్రారంభించి వచ్చే నెలకు గాను థియేటర్లను ఓపెన్ చేయాలనే నిర్ణయానికి వచ్చారు.థియేటర్ల పై ప్రస్తుతం ఎలాంటి బ్యాన్ లేదు.కాని జనాలు రారు అనే ఉద్దేశ్యంతో మూసి వేయడం జరిగింది.
ప్రభుత్వం జులై 1 నుండి పూర్తిగా లాక్ డౌన్ ను ఎత్తి వేయబోతుంది.కనుక అప్పటి వరకు విడుదలకు సిద్దంగా ఉండాలనే నిర్ణయానికి థియేటర్ల యాజమాన్యాలు వచ్చాయి.
మొత్తానికి టాలీవుడ్ లో మళ్లీ కళ కళ మొదలు అవ్వడం ఖాయం గా కనిపిస్తుంది.ఏప్రిల్ నుండి మొదలుకుని సినిమా ల విడుదల నిలిచి పోయాయి.
ఇక ఈ సినిమా లు అన్ని కూడా జులై మరియు ఆగస్టుల్లో విడుదల అయ్యే అవకాశాలు ఉన్నాయంటున్నారు.మళ్లీ థర్డ్ వేవ్ కూడా అంటున్న నేపథ్యంలో ఏం జరుగుతుందో అంటూ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.