కరోనా వైరస్ పై మొదటి నుండి అమెరికా మాజీ అధ్యక్షుడు ఇది చైనా వైరస్ అంటూ నామకరణం చేసి చైనాలో వూహాన్ ల్యాబ్‌లోనే సృష్టించినట్లు ఆరోపించడం తెలిసిందే.కావాలని ప్రపంచంలోకి చైనా పంపింది అంటూ అప్పట్లో తాను చెప్పిన వ్యాఖ్యలు ఇప్పుడు నిజమైనవి అంటూ తాజాగా డోనాల్డ్ ట్రంప్ సంచలన కామెంట్స్ చేశారు.
ఈ క్రమంలో ఇటీవల కావాలని ఈ వైరస్ ల్యాబ్ లో సృష్టించారు కొన్ని దేశాల అధ్యయనాల్లో బయటపడుతున్న విషయాలను గుర్తు చేశారు.
ప్రపంచ దేశాలను ఇంత సంక్షోభంలోకి నెట్టి వేసిన నేపథ్యంలో చైనా ప్రపంచదేశాలకు భారీ మూల్యం చెల్లించాలి అని .అప్పట్లో తాను చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు శత్రువుల సహా చాలా మంది డిమాండ్ చేస్తున్నారని పేర్కొన్నారు.మొత్తం 10 ట్రిలియన్ డాలర్లు చెల్లించాలని అప్పట్లో డిమాండ్ చేయడం జరిగింది.అయితే ట్రంప్ వూహాన్ ల్యాబ్ గురించి చేసిన ఆరోపణలకు ఆధారాలు లేవని శాస్త్రవేత్తలు కొట్టిపారేశారు.
అయితే ఇటీవల బ్రిటన్ పరిశోధకులు .చేసిన అధ్యయనంలో చైనా శాస్త్రవేత్తలు కావాలని ఉద్దేశపూర్వకంగా ఈ వైరస్ ప్రపంచంలోకి వదిలినట్లు పేర్కొనడంతో మరోసారి ట్రంప్ తాను చేసిన వ్యాఖ్యలు ప్రపంచం అంగీకరిస్తున్నట్లు ఇటీవల చెప్పుకొచ్చారు.