వింటర్ సీజన్ రానే వచ్చింది.ఇప్పటికే చలి పులిల ప్రజలపై పంజా విసురుతోంది.
అయితే ఈ చలి కాలంలో ఉదయాన్నే ఓ కప్పు వేడి వేడి టీ తాగితే… అబ్బబ్బబ్బా ఎంత మజా ఉంటుంది.అందులోనూ మసాలా టీ తాగితే.
ఆ కిక్కే వేరు.దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు, మిరియాలు, జాజికయ ఇలా వివిధ సుగంధ ద్రవ్యాలతో తయారు చేసే మసాలా టీ రుచిలోనే కాదు.
బోలెడన్ని ఆరోగ్య ప్రయోజనాలు అందించడంలోనూ అద్భుతంగా సహాయపడుతుంది.
ముఖ్యంగా ఈ వింటర్ సీజన్లో మసాలా టీ తాగితే ఎంతో మేలంటున్నారు ఆరోగ్య నిపుణులు.
ఎందుకూ అంటే.ఈ వింటర్ సీజన్లో వణికించే చలితో పాటు రోగాలు కూడా ఎక్కువే.
జలుబు, దగ్గు, వైరల్ జ్వరాలు ఇలా రకరకాల అనారోగ్య సమస్యలు ఈ సీజన్లోనే ఎక్కువగా వస్తుంటాయి.ఈ రోగాలను ఎదుర్కోవాలంటే శరీర రోగ నిరోధక వ్యవస్థ బలంగా ఉంటాయి.
అయితే రోజుకు ఒక కప్పు మసాలా టీ తాగడం వల్ల అందులో పుష్కలంగా ఉండే యాంటీ యాక్సిడెంట్లు రోగ నిరోధక శక్తిని పెంచుతుంది.రోగాలు రాకుండాఅడ్డుకట్టవేస్తుంది.
అలాగే మసాలా టీతో మరిన్ని ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి.నేటి కాలంలో చాలా మందిని వేధిస్తున్న సమస్య అధిక బరువు.ఇక బరువు తగ్గడానికి చాలా మంది గ్రీన్ టీనే ఎంచుకుంటారు.కానీ, మసాలా టీతో కూడా బరువు తగ్గొచ్చు.
ఎలాంటి, ఈ టీ తయారీలో వాడే మసాలా దినుసులు శరీరంలో అదనంగా పేరుకుపోయిన కొవ్వును కరిగించేసి.బరువు తగ్గేలా చేస్తుంది.
మరియు గుండె జబ్బులను కూడా దూరం చేస్తుంది.
ప్రతి రోజు ఒక కప్పు మసాలా టీ తాగడం వల్ల గ్యాస్, ఎసిడిటీ, కడుపు ఉబ్బరం వంటి సమస్యలు దూరం అయ్యి.
జీర్ణ వ్యవస్థ చురుగ్గా పని చేసేలా చేస్తుంది.మధుమేహం వ్యాధి గ్రస్తులు కూడా మసాలా టీని తాగొచ్చు.మసాలా టీ తయారీలో ఉపయోగించే లవంగాలు, దాల్చినచెక్క మరియు ఇతర దినుసులు బ్లడ్ షుగర్ లెవల్స్‌ను తగ్గిస్తాయి.అదే సమయంలో రక్తపోటును కూడా కంట్రోల్ చేస్తాయి.