ఈ మధ్య కాలంలో చాలా మంది మధుమేహం తో బాధ పడుతున్నారు.ఇక మధుమేహాన్ని అదుపులో ఉంచడానికి ఎన్నో మందులను ఇన్సులిన్ లను వాడుతున్నారు.
అయితే రోజు తీసుకునే ఆహారం ద్వారా మధుమేహాన్ని నియంత్రణలో ఉంచవచ్చు.పనస పండు యొక్క పొట్టు మధుమేహాన్ని నియంత్రణలో ఉపయోగపడుతుందని వైద్యులు చెబుతున్నారు.
అయితే పనసపొట్టును కూరగా గానీ, బిర్యానీగా గానీ ఏ రూపంలోనైనా ఆహారంలో తీసుకున్నా కూడా మీకు మధుమేహం అదుపులో ఉంటుంది.ఇక రోజూ పనస పొట్టును ఆహారంలో తీసుకుంటే బ్లడ్‌షుగర్ నియంత్రణలో ఉండటంతో పాటు మలబద్ధకం వంటి సమస్యలు దూరమైనట్లు పరిశోధనల్లో తేలింది.
ఈ విషయాన్ని అహ్మదాబాద్ రామానంద్ క్లినిక్ ఎండ్రోకిన్ పిజీషియన్ డాక్టర్ వినోద్ అభిచందాని తెలిపారు.
జాక్‌ఫ్రూట్ 365 సంస్థ శుక్రవారం బంజారాహిల్స్‌లోని ఓ హోటల్‌లో మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసింది.
ఈ కార్యక్రమంలో డాక్టర్ వినోద్ మాట్లాడుతూ,పనస పండు దక్షిణాది వంటకాల్లో విరివిగా వాడతారాని పండని పనసను ఎండబెట్టి పౌడర్ రూపంలో ఆహార పదార్థాల్లో కలిపి తింటే ప్రయోజనం ఉంటుందని ఆయన చెప్పారు.అలాగే జాక్ ఫ్రూట్ 365 వ్యవస్థాపకులు జేమ్స్ జోసెఫ్ పరిశోధన వివరాలను వెల్లడించారు.
ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళంలో ఉన్న ప్రభుత్వ వైజ్ఞానిక సంస్థలో టైప్ టూ డయాబెటిస్‌తో బాధపడుతున్న వారు 18 నుంచి 60 ఏళ్ల మధ్య వయసు వారని 40 మందిని రెండు గ్రూప్‌లుగా విభజించి పరిశోధనలు నిర్వహించామని చెప్పారు.

ఒక గ్రూపు వారికి భోజనానికి ముందు పచ్చి పనస పొట్టునీ వరుసగా 12 వారాల పాటు అందించామని చెప్పారు.అయితే పచ్చి పసన పొట్టు తీసుకున్న వారితో పోల్చితే, టైప్ టూ డయాబెటిస్ మెలిటస్ రోగుల్లో గ్లైసిమిన్ నియంత్రణలో ఉన్నట్లు గుర్తించామని వారు తెలిపారు.ఫెర్నాండజ్ ఆస్పత్రి డిపార్ట్‌మెంట్ ఆఫ్ క్లినికల్ న్యూట్రిషన్ హెచ్‌వోడీ డాక్టర్ లతా శశి మాట్లాడుతూ, మధుమేహ రోగుల్లో పచ్చి పనసపొట్టు ప్రయోగాన్ని తాను పరిశీలించానని చెప్పారు.
ఇక దీనిపై మరిన్ని పరిశోధనలు జరిగితే మధుమేహ రోగులకు మేలు జరుగుతుందని ఆమె చెప్పారు.