స్వయంకృషితో సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి దాదాపు నాలుగు దశాబ్దాల నుంచి అభిమానులకు నచ్చే కథలను ఎంచుకుంటూ చిరంజీవి సత్తా చాటుతున్నారు.చిరంజీవి కెరీర్ లో ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్ సినిమాలు ఉండటంతో పాటు నటుడిగా విమర్శకుల ప్రశంసలు పొందిన సినిమాలు ఉన్నాయి.
మెగాస్టార్ నటించిన కొన్ని సినిమాలు హిట్ కాకపోయినా ఆ సినిమాలు ఒక వర్గం ప్రేక్షకులను మాత్రం సాధించాయి.
చిరంజీవి సినీ కెరీర్ గురించి ప్రస్తావించాల్సి వస్తే ఖైదీ సినిమా గురించి తప్పకుండా చెప్పుకోవాలి.
కోదండ రామిరెడ్డి డైరెక్షన్ లో ఈ తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో చిరంజీవి కెరీర్ లోనే ప్రత్యేక చిత్రంగా నిలిచింది.బీ గోపాల్ డైరెక్షన్ లో రాయలసీమ బ్యాక్ డ్రాప్ కథలో చిరంజీవి నటించిన ఇంద్ర సినిమా సృష్టించిన సంచలనాలు అన్నీఇన్నీ కావు.
కలెక్షన్లపరంగా కూడా ఈ సినిమా కొత్త రికార్డులను క్రియేట్ చేసింది.
రాఘవేంద్రరావు డైరెక్షన్ లో చిరంజీవి హీరోగా తెరకెక్కిన జగదేకవీరుడు అతిలోక సుందరి బాక్సాఫీస్ ను షేక్ చేసిన సంగతి తెలిసిందే.
ఈ సినిమాను రామ్ చరణ్ జాన్వీ కపూర్ హీరోహీరోయిన్లుగా రీమేక్ చేయాలని మెగా ఫ్యాన్స్ లో కొంతమంది కోరుకుంటున్నారు.కె విశ్వనాథ్ డైరెక్షన్ లో చిరంజీవి హీరోగా నటించిన స్వయం కృషి నటుడిగా చిరంజీవి స్థాయిని పెంచిన చిత్రమని చెప్పవచ్చు.
బాలచందర్ డైరెక్షన్ లో తెరకెక్కిన రుద్రవీణ సినిమా కమర్షియల్ రిజల్ట్ ను పక్కనపెడితే చిరంజీవిని నటుడిగా మరో స్థాయికి ఈ సినిమా తీసుకెళ్లినట్లు తెలుస్తోంది.
రాఘవేంద్రరావు డైరెక్షన్ లో మెగాస్టార్ హీరోగా తెరకెక్కిన ఘరానా మొగుడు బాక్సాఫీస్ దగ్గర మంచి కలెక్షన్లను సాధించింది.జంధ్యాల డైరెక్షన్ లో తెరకెక్కిన చంటబ్బాయ్ చిరంజీవి అద్భుతంగా కామెడీ చేయగలరని ప్రూవ్ చేసింది.ఛాలెంజ్, ముఠా మేస్త్రీ, కొండవీటి దొంగ సినిమాలు కోదండరామిరెడ్డి డైరెక్షన్ లో తెరకెక్కి చిరంజీవికి నటుడిగా మంచిపేరును తెచ్చిపెట్టాయి.