మనలో చాలా మందికి డాన్స్ చేయడం అంటే ఎంతో ఇష్టం.ఏదైనా కొత్త పాట వచ్చిందంటే దానికి కొత్త రకం డ్యాన్స్ చేసి మెప్పించాలన్న అత్యుత్సాహం చాలామందిలో కనబడుతుంటుంది.
అయితే ఇలాంటి డ్యాన్స్ లు కేవలం కొద్ది వయసు వరకు మాత్రమే చేస్తూ ఉండటం సర్వసాధారణంగా గ్రహించవచ్చు.ఎక్కడ చూసినా పిల్లలు, యువకులు లేదా సినిమాలలో హీరోహీరోయిన్లు డాన్స్ వేయడమే మనం గమనిస్తుంటాం.
నిజ జీవితంలో మాత్రం ఒక వయసు వచ్చిన వారు మాత్రం డాన్స్ చేయడం చాలా అరుదుగా గమనిస్తూ ఉంటాం.ఇక అసలు విషయంలోకి వెళితే.
తమకి వయసు అయిపోయిందని నైరాశ్యంలో కూరుకుపోయి బాధపడేవారికి వయస్సు అనేది కేవలం ఒక అంకె మాత్రమేనని తాజాగా ఓ వృద్ధ జంట నిరూపించిందని చెప్పవచ్చు.వారి జీవితాన్ని పూర్తిగా ఆస్వాదించేందుకు తమ వయసు మీద పడటం అడ్డంకి కానేకాదని వారు ప్రపంచానికి చాటి చెప్పేలా ఓ పాటకు అదిరిపోయే స్టెప్పులు వేశారు.
ఓ స్పానిష్ పాటకు అనుగుణంగా ఆ వృద్ధ జంట వారి డ్యాన్సులతో అదరగొట్టిన వీడియో ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది.ఈ వీడియో లో వృద్ధ జంట చేస్తున్న డాన్స్ చూస్తే మనము డాన్స్ చేసే వారి లిస్టులో ఎంత చివర ఉన్నామో ఇట్టే అర్థమైపోతుంది.
సోషల్ మీడియాలో ఈ వీడియో పై నెటిజెన్స్ పెద్ద ఎత్తున కామెంట్స్ వర్షం కురిపిస్తున్నారు.
ఈ వృద్ధ జంట చేసిన డాన్స్ తో అనేక మంది నెటిజన్లను వారివైపు కట్టిపడేసి నట్లయింది.
ఆ వృద్ధ జంట అచ్చం ఓ ప్రొఫెషనల్ డాన్సర్లు ఎలా డాన్స్ చేస్తారో అలాగే వారిని తలపిస్తూ డాన్స్ చేయడం ఇప్పుడు అందరిని ఆకర్షిస్తోంది.ఆ వయసులో కూడా వారు డ్యాన్స్ పై ఎటువంటి పట్టు కోల్పోలేదన్న విషయం అర్థమవుతుంది.
సోషల్ మీడియాలో వీరి డ్యాన్స్ చూసి వయస్సు వీరికి కేవలం ఒక సంఖ్య మాత్రమే అని తెలపగా.మరికొందరు ఈ వృద్ధ జంట ఎక్కడున్నారో చెప్పండి మేము కూడా వెళ్లి వారి దగ్గర శిష్యరికం చేస్తామని ఫన్నీగా కామెంట్ చేస్తున్నారు.
వీడియోలో కనిపిస్తున్న వృద్ధుడు ఓ ఫిల్మ్ మేకర్ వలె ఉన్నాడని పేర్కొంటున్నాడు.ఇంకెందుకు ఆలస్యం ఈ వైరల్ వీడియోని మీరు కూడా చూసి మీరు కూడా డాన్స్ చేయడానికి ట్రై చేయండి.