కేసీఆర్ కు ఈటెలకు మధ్య రాజకీయంగా ప్రచ్చన్న యుద్ధం జరుగుతున్నదనే చెప్పవచ్చు.అయితే కేసీఆర్ ఈటెల రాజేందర్ ను భర్తరఫ్ చేసిన తరువాత ఈటెల ఏ మాత్రం తగ్గకుండా కేసీఆర్ ను ధీటుగా ఎదుర్కొంటూ బలమైన వ్యూహాలు రచిస్తున్నాడు.
ఇప్పటికే హైదరాబాద్ నుండి ఈటెల నియోజకవర్గం హుజురాబాద్ కు వెళ్తున్న క్రమంలో అతి పెద్ద కాన్వాయ్ తో మార్గ మధ్యలో ముదిరాజు సంఘ నాయకులను కలుస్తూ రకరకాల ప్రచారాలకు తెరదీసాడు.అంతేకాక హుజురాబాద్ టీఆర్ఎస్ నాయకులను కాపాడుకోవడానికి కేసీఆర్ తీవ్రంగా ప్రయత్నిస్తున్నాడు.
ఇప్పటికే గంగుల కమలాకర్ హుజురాబాద్ టీఆర్ఎస్ నేతలతో భేటీ అయి టీఆర్ఎస్ లో సముచిత స్థానం కల్పిస్తామని భరోసా ఇచ్చారు.ఈ వ్యవహారాన్ని మొత్తం గమనిస్తున్న కేసీఆర్ ఈటెల భేటీ వెనుక కారణాల్ని, ఈటెల ఎటువంటి చర్యలు తీసుకోబోతున్నారనే దానిపై కేసీఆర్ ఇంటిలిజెన్స్ ద్వారా సమాచారాన్ని తెప్పించుకున్నట్లు తెలుస్తోంది.
ఎందుకంటే హుజురాబాద్ టీఆర్ఎస్ కు కంచుకోట అనే విషయం తెలిసిందే.అయితే ఈటెల ఎటువంటి నిర్ణయం తీసుకున్నా పార్టీకి ఎటువంటి నష్టం జరగకూడదని కేసీఆర్ భావిస్తున్నట్టు సమాచారం.
ఒకవేళ హుజూరాబాద్ లో టీఆర్ఎస్ బలహీనపడితే దాని ప్రభావం రాష్ట్రమంతా పడే అవకాశం ఉంది.అందుకే హుజురాబాద్ పరిణామాలపై కేసీఆర్ నిశితంగా పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది.