తెలంగాణ రాజకీయాలలో ఫైర్ బ్రాండ్ గా రేవంత్ రెడ్డికి మంచి క్రేజ్ ఉందనే విషయం తెలిసిందే.మొదటి నుండి కేసీఆర్ నిర్ణయాలను ధీటుగా వ్యతిరేకిస్తూ రాష్ట్ర రాజకీయాలలో పార్టీతో నిమిత్తం లేకుండా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు.
అయితే ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో బలహీనంగా ఉన్న విషయం తెలిసిందే.అయితే ఇప్పటివరకు జరిగిన అన్ని ఎన్నికల్లో కాంగ్రెస్ ను ఒంటి చేత్తో నడిపిస్తూ కాంగ్రెస్ పార్టీని విజయం దిశగా నడిపించేందుకు తన వంతు కృషి చేసాడు.
అయితే ఇప్పుడు కాంగ్రెస్ ప్రజల్లో అంతగా బలంగా లేకపోవడంతో పక్కచూపులు చూసిన పరిస్థితి ఉంది.
అయితే త్వరలో సార్వత్రిక ఎన్నికలు జరగనున్న తరుణంలో తన రాజకీయ భవిష్యత్తుకే ప్రమాదం ఉన్నదని భావిస్తున్న రేవంత్ రెడ్డి ఇప్పటికే కొండా విశ్వేశ్వర్ రెడ్డితో కలిసి పార్టీ ప్రారంభించాలని మొదట యోచించిన రేవంత్ రెడ్డి తరువాత ఆ ప్రయత్నాన్ని విరమించుకున్నాడు.
మరి భవిష్యత్తులో కొత్త పార్టీ పెడతాడా లేక కాంగ్రెస్ లోనే కొనసాగుతాడా అన్నది చూడాల్సి ఉంది.అయితే పార్టీ మార్పుపై, కొత్త పార్టీ ఏర్పాటుపై పెద్దగా స్పందించకున్నా రాజకీయ విశ్లేషకులు రేవంత్ కొంత అయోమయ స్థితిలో ఉన్నాడని, ఇప్పటికైతే రేవంత్ తీసుకునే నిర్ణయాలపై తన భవిష్యత్ ఆలోచనను తెలిపే విధంగానే రేవంత్ నిర్ణయం ఉండే అవకాశం ఉంది.