టాలీవుడ్ మోస్ట్ హ్యాండ్సమ్ హీరో విజయ్ దేవరకొండ అంటే ఎంత క్రేజ్ ఉందో అందరికి తెలిసిందే.విజయ్ దేవరకొండ కు అభిమానులలో ఎక్కువగా అమ్మాయిలే ఉన్నారు.
ఒక్క సినిమాతోనే ఎంతో క్రేజ్ పెంచుకున్న విజయ్.వరుస ఆఫర్లతో బాగా బిజీ గా మారాడు.
విజయ్ సోషల్ మీడియాలో కూడా తన సంబంధించిన ఫోటోలను ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకుంటాడు.
చిన్న చిన్న పాత్రలతో సినిమాలో అడుగుపెట్టిన విజయ్ 2016 లో పెళ్లి చూపులు సినిమాతో హీరోగా పరిచయమయ్యారు.
ఆ తర్వాత మరో సినిమా లో నటించడం అంత గుర్తింపు లేకపోయేసరికి.తర్వాత అర్జున్ రెడ్డి సినిమా తో బాక్సాఫీస్ వద్ద రికార్డు కొట్టాడు.ఈ సినిమా హిందీలో కూడా రీమేక్ అవ్వగా విజయ్ కు బాలీవుడ్ లో కూడా ఫ్యాన్స్ ఫాలోయింగ్ మరింత పెరిగింది.అంతే కాకుండా బాలీవుడ్ స్టార్ తో కలిసి కొన్ని రోజుల కిందట ముంబైలో ఓ పార్టీలో పాల్గొన్న సంగతి తెలిసిందే.
తాజాగా విజయ్ దేవరకొండ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కనున్న పాన్ ఇండియా సినిమా ” లైగర్: సాలా క్రాస్ బ్రీడ్” లో నటిస్తున్నాడు.ఈ సినిమాలో విజయ్ బాక్సర్ గా కనిపించనున్నాడు.ఇక ఈ సినిమాకు నిర్మాతగా కరణ్ జోహార్ పనిచేస్తున్నాడు.ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ సమయంలో ఉండగా.ముంబై కు చిత్ర బృందం మొత్తం చేరుకున్నారు.
ఇక అక్కడ బాలీవుడ్ సెలబ్రిటీలను కలుస్తూ.
వారితో కలిసి దిగిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.ఈ సినిమా టీం మొత్తం అక్కడ పార్టీలో సందడి చేయగా అందులో హీరోయిన్ ఛార్మి తన ఇన్స్టాగ్రామ్లో ఫోటోలను షేర్ చేస్తూ ఈ విధంగా పోస్ట్ చేసింది.
ఈ పార్టీని ఏర్పాటు చేసిన మనీష్ కు కృతజ్ఞతలు తెలుపుతూ పార్టీ చాలా సంతోషంగా గడిచిందని, అమేజింగ్ ఫుడ్, అమేజింగ్ పీపుల్ అంటూ క్యాప్షన్ ఇచ్చింది.ఇక ఇందులో చార్మి , విజయ్ దేవరకొండ, బాలీవుడ్ హీరోయిన్లు సారా అలీ ఖాన్, కియారా అద్వానీ, ఫ్యాషన్ డిజైనర్ మనీష్ మల్హోత్రా, నిర్మాత కరణ్ జోహార్ పాల్గొన్నందుకు సంతోషమని తెలిపింది.