బైడెన్ నిర్ణయాలపై మొదలైన రిపబ్లికన్ల సెగ: ముందుగా హెచ్ 1 బీ వీసాపై ..!!

అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత దూకుడుగా వెళ్తున్నారు జో బైడెన్.మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న పలు నిర్ణయాలను రద్దు చేయడమో, లేదంటే వాయిదా వేయడమో చేస్తూ తన వైఖరి ఏంటో స్పష్టం చేస్తున్నారు.

 Us Senator Opposes Biden Administration Move To Revert To H-1b Lotteries, Republ-TeluguStop.com

ఈ క్రమంలో కొంతకాలం మౌనముద్ర దాల్చిన ప్రతిపక్ష రిపబ్లిక్లన్లు ఆయన నిర్ణయాలపై పెదవి విరుస్తున్నారు.తాజాగా హెచ్ 1 బీ వీసాల జారీ ప్రక్రియను లాటరీ విధానంలో కొనసాగించాలని బైడెన్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని రిపబ్లికన్ సెనేటర్ టామ్ కాటన్ తప్పుబట్టారు.

ఈ విధానంతో కంపెనీలకు స్థానిక అమెరికన్లకు బదులు తక్కువ వేతనంతో పనిచేసే విదేశీయులను బైడెన్ ప్రభుత్వం గిఫ్ట్‌గా ఇస్తోందని కాటన్ ఆరోపించారు.హెచ్ 1 బీ వీసా కార్యక్రమాన్ని బడా కంపెనీలు దుర్వినియోగం చేసేందుకు బైడెన్ యంత్రాంగం వీలు కల్పించిందంటూ ఆయన మండిపడ్డారు.

Telugu Hb, Hb Visa, Lottery System, Republican, Republicantom, Opposesbiden-Telu

కాగా, హెచ్‌-1బీ వీసాల ఎంపిక ప్రక్రియలో ట్రంప్‌ తీసుకొచ్చిన నూతన నిబంధనలను డిసెంబర్ 31 వరకు వాయిదా వేస్తూ బైడెన్ యంత్రాంగం ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే.హెచ్‌-1బీ వీసాల జారీలో దశాబ్ధాలుగా అమలు చేస్తున్న కంప్యూటరైజ్డ్‌ లాటరీ పద్ధతికి స్వస్తి పలుకుతూ మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ కీలక సంస్కరణలు తీసుకొచ్చారు.గరిష్ఠ వేతన స్థాయి, నైపుణ్యం ఆధారంగా వీసాలు ఇచ్చేలా కీలక సవరణ చేశారు.దీనికి అనుగుణంగా హెచ్‌-1 బీ ఎంపికలో లాటరీ విధానాన్ని రద్దు చేస్తున్నట్లు అమెరికా పౌరసత్వ, వలస సేవల సంస్థ (యూఎస్‌సీఐసీ) జనవరి 7న తుది ప్రకటన కూడా చేసింది.

దీని ప్రకారం మార్చి 9 నుంచి కొత్త ఎంపిక విధానం అమల్లోకి రావాల్సి ఉంది.

Telugu Hb, Hb Visa, Lottery System, Republican, Republicantom, Opposesbiden-Telu

అయితే కొత్త విధానానికి అనుగుణంగా హెచ్‌-1బీ రిజిస్ట్రేషన్ వ్యవస్థ, ఎంపిక ప్రక్రియలో మార్పులు చేయాల్సి ఉన్నందున కాస్త సమయం పట్టే అవకాశం వుంది.అందువల్ల నూతన విధానాన్ని డిసెంబరు 31 వరకు వాయిదా వేస్తున్నట్లు డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ హోంల్యాండ్‌ సెక్యూరిటీ ఓ ప్రకటనలో తెలిపింది.అప్పటివరకు పాత లాటరీ విధానాన్నే కొనసాగించనున్నట్లు వెల్లడించింది.

కాగా, ఏటా హెచ్‌-1బీ వీసాల కోసం లక్షల సంఖ్యలో దరఖాస్తులు వస్తుంటాయి.వీటిలో కంప్యూటర్‌ ఆధారిత లాటరీ పద్ధతి ద్వారా 65వేల దరఖాస్తులను ఎంపిక చేసి అమెరికా వీసా జారీ చేస్తుంది.

వీటితో పాటు సైన్స్‌, టెక్నాలజీ, ఇంజినీరింగ్‌, మ్యాథమెటిక్స్‌ (STEM) విభాగాల్లో అమెరికా యూనివర్శిటీల్లో ఉన్నత విద్య పూర్తి చేసిన విదేశీ విద్యార్థులకు మరో 20వేల వీసాలు ఇస్తారు.అంటే మొత్తం 85 వేల హెచ్ 1 బీ వీసాలన్న మాట.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube