తమిళ స్టార్ విజయ్ హీరోగా, విజయ్ సేతుపతి విలన్ పాత్రలో నటించి సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు విడుదలైన “మాస్టర్” చిత్రం మంచి విజయాన్ని అందుకుంది.ఈ సినిమా థియేటర్లలో విడుదలై కేవలం పదిహేను రోజులు అయినప్పటికీ ఈ సినిమా అప్పుడే ఓటీటిలో ప్రసార కావడంతో కొంత వరకు అభిమానులకు నిరాశ పరిచిన, నిర్మాతలకు మాత్రం ఎంతో ఆనందం ఇస్తుందని చెప్పవచ్చు.
మంచి కథనం తో తెరకెక్కిన ఈ సినిమాకు ప్రేక్షక ఆదరణ లభించడంతో అమెజాన్ ఏకంగా ఈ సినిమాను భారీ మొత్తంలో కొనుగోలు చేసింది.ట్రేడ్ వర్గాల మేరకు అందిన సమాచారం ప్రకారం అమెజాన్ ప్రైమ్ “మాస్టర్” సినిమా డిజిటల్ రైట్స్ ను ఏకంగా 36 కోట్ల రూపాయలను చెల్లించి అమెజాన్ సొంతం చేసుకుందని సమాచారం.
అయితే అమెజాన్ ప్రైమ్ మొదటిగా ఈ చిత్రాన్ని కి 20 కోట్లు చెల్లిస్తామని తెలియజేశారు.సినిమా ప్రీమియర్ చూసిన తర్వాత మరో 16 కోట్ల రూపాయలను అధికంగా చెల్లించి అమెజాన్ ప్రైమ్ ఈ సినిమాను సొంతం చేసుకున్నారు.
అయితే ఇంతకు ముందు అగ్రిమెంట్ ప్రకారం సినిమా రిలీజ్ అయిన 15 రోజుల తర్వాత స్ట్రీమింగ్ చేయాలని అగ్రిమెంట్ ఉండడంతో ప్రస్తుతం అమెజాన్ అదే అగ్రిమెంటును అనుసరిస్తున్నారు.
![Telugu Amazon, Amazon Prime, Amazonprime, Master, Ott, Tamil, Vijay, Vijays Mast Telugu Amazon, Amazon Prime, Amazonprime, Master, Ott, Tamil, Vijay, Vijays Mast](https://telugustop.com/wp-content/uploads/2021/01/Vijay-Sethupathi-Master-Movie-Amazon-Prime-Video.jpg)
కరోనా కారణం వల్ల థియేటర్లు మూతపడడంతో ఓటీటి ఫ్లాట్ ఫామ్ కి మంచి ఆదరణ లభించిందని చెప్పవచ్చు.ఈ సందర్భంగానే అమెజాన్ ప్రైమ్ ఈ సినిమాను ఓటీటిలో విడుదల చేయడంతో తమ ఛానల్ కు మరింత మంది సబ్ స్కైబర్లు పెరిగే అవకాశాలు ఉన్నాయంటూ అంచనా వేస్తున్నారు.ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలై మంచి విజయాన్ని అందుకున్న ఈ సినిమా ఇప్పటికే దాదాపు 200 కోట్ల రూపాయల వరకు వసూలు రాబట్టింది అనే సమాచారం వినబడుతోంది.
ఈ చిత్రం వసూలు చేసిన కలెక్షన్స్, ఆదరించిన తీరు ఎంతోమంది నిర్మాతలకు ధైర్యాన్ని ఇచ్చి తమ సినిమాలను కూడా థియేటర్లలో విడుదల చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారని చెప్పవచ్చు.తమిళంతో పాటు కన్నడ, హిందీ, తెలుగు,మలయాళ భాషల్లో విడుదలైన ఈ చిత్రం మంచి గుర్తింపును తెచ్చుకుంది.