స్టార్ హీరోయిన్లలో నయనతార రూటే సపరేటు.ఇతర స్టార్ హీరోయిన్లతో పోలిస్తే ఎక్కువ మొత్తంలో రెమ్యునరేషన్ తీసుకునే నయనతార ఆడియో ఫంక్షన్లలో, ప్రీ రిలీజ్ ఈవెంట్లలో, సినిమా ప్రమోషన్లలో పాల్గొనడానికి పెద్దగా ఇష్టపడరు.
గతంలో ప్రేమలో విఫలం కావడం, ఇంటర్వ్యూల్లో ఆ ప్రేమకు సంబంధించిన ప్రశ్నలు ఎదురవుతూ ఉండటంతో ఇంటర్వ్యూలకు కూడా నయనతార దూరంగా ఉంటున్నారు.
కోలీవుడ్ డైరెక్టర్ విఘ్నేష్ శివన్ తో ప్రేమలో ఉన్న నయనతార తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలను మీడియాతో పంచుకోవడానికి పెద్దగా ఇష్టపడటం లేదు.
అయితే సోషల్ మీడియాలో మాత్రం నయనతార యాక్టివ్ గా ఉంటున్నారు.సాధారణంగా సినిమా సెలబ్రిటీలు మీడియాకు దూరంగా ఉండటానికి పెద్దగా ఇష్టపడరు.అయితే నయనతార మీడియాకు దూరంగా ఉండటానికి స్టార్ హీరో అజిత్ కారణమని తెలుస్తోంది.

స్టార్ హీరో అజిత్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన కొత్తలో ఇంటర్వ్యూలు ఇస్తూ మీడియాకు ఎప్పుడూ అందుబాటులో ఉండేవారు.అయితే ఒక సందర్భంలో అజిత్ చేసిన కామెంట్లను మీడియా నెగిటివ్ గా ప్రొజెక్ట్ చేయడంతో ఆయనకు చెడ్డపేరు వచ్చింది.అప్పటినుంచి అజిత్ మీడియాకు వీలైనంత దూరంగా ఉండేందుకు ప్రయత్నిస్తున్నారు.
నయనతార కూడా కెరీర్ మొదట్లో ఇలాంటి ఇబ్బందులనే ఎదుర్కొన్నారు.
అయితే అజిత్ నయనతారకు మీడియా విషయంలో తనలా వ్యవహరించమని సూచించారని అప్పటినుంచి నయనతార మీడియాకు దూరంగా ఉంటున్నారని తెలుస్తోంది.
అయితే మీడియాకు దూరంగా ఉన్నప్పటికీ ఏదో ఒక విధంగా నయనతార వార్తల్లో నిలుస్తూ ఉండటం గమనార్హం.ఈ ఏడాది అమ్మోరు తల్లి సినిమాతో హిట్ అందుకున్న నయనతార ప్రస్తుతం రజనీకాంత్ కు జోడీగా అన్నాత్తే సినిమాతో పాటు మరికొన్ని సినిమాలలో నటిస్తున్నారు.
అన్నాత్తే యూనిట్ లో కొంతమందికి కరోనా సోకడంతో ఈ సినిమా షూటింగ్ తాత్కాలికంగా వాయిదా పడింది.ఈ సినిమాలో హీరోగా నటిస్తున్న రజనీకాంత్ సైతం రెండు రోజుల క్రితం అస్వస్థతకు గురై ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రస్తుతం చెన్నైలోని ఇంట్లో రెస్ట్ తీసుకుంటున్న సంగతి తెలిసిందే.