టాలీవుడ్ ఇండస్ట్రీలో మెగాస్టార్ తమ్ముడిగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకొని ఒక రేంజ్ లో స్టార్ డమ్ సొంతం చేసుకున్నారు.1996 సంవత్సరంలో అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి చిత్రం ద్వారా వెండితెరకు పరిచయమైన పవన్ కళ్యాణ్ ఎన్నో బ్లాక్ బస్టర్ చిత్రాలను అందించి, ప్రేక్షకాదరణ పొందారు.
దాదాపుగా 24 సంవత్సరాల తన సినీ ప్రస్థానంలో, పవన్ కళ్యాణ్ కేవలం 25 సినిమాలలో నటించిన ఎంతో క్రేజ్ ఉన్న హీరోగా ఇండస్ట్రీలో రాణిస్తున్నారు.కేవలం 25 సినిమాలకే ఇంతటి స్టార్ గుర్తింపు సంపాదించుకున్న పవన్ కళ్యాణ్, కొన్ని కారణాల వల్ల ఆగిపోయిన ఆ సినిమాలలో నటించి ఉంటే పవన్ కళ్యాణ్ జీవితం మరోలా ఉండేదని టాలీవుడ్ సమాచారం.అయితే పవన్ కళ్యాణ్ సినిమాలు ఒప్పుకొని, కొన్ని కారణాల వల్ల మధ్యలో ఆగిపోయిన ఆ సూపర్ హిట్ సినిమాలు ఏమిటో ఇక్కడ తెలుసుకుందాం…
చెప్పాలని ఉంది:
తరుణ్, రిచా జత కట్టి నటించిన నువ్వే కావాలి సినిమా గా దర్శకుడు విజయభాస్కర్ తెరకెక్కించిన ఈ చిత్రం, రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా విడుదలై బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్ల వర్షం కురిపించింది.బడ్జెట్ కన్నా 20 శాతం అధిక వసూళ్లను రాబట్టింది.అయితే ఈ సినిమాలు ముందుగా హీరో పాత్రలో పవన్ కళ్యాణ్ నటించాల్సి ఉండగా, కొన్ని కారణాల వల్ల పవన్ కళ్యాణ్ తప్పుకొని తరుణ్ నటించారు.
సత్యాగ్రహి
: పేట్రియాటిక్ కథాంశంతో సత్యాగ్రహి సినిమాని స్వయంగా పవన్ కళ్యాణ్ తెరకెక్కించాలనుకున్నారు.కానీ అప్పటికే పవన్ కళ్యాణ్ దర్శకత్వం వహించిన జాని పరాజయం కావడంతో ఈ సినిమా విషయంలో వెనుకడుగు వేశారు.
అమ్మ నాన్న ఓ తమిళమ్మాయి:
పవన్ కళ్యాణ్, పూరి జగన్నాథ్ కాంబినేషన్లో సూపర్ హిట్ అయిన బద్రి సినిమా తర్వాత ఈ సినిమా చేయాలని భావించారు.అయితే వీరిద్దరి మధ్య మనస్పర్థలు తలెత్తడం వల్ల ఈ సినిమాలో నటించే అవకాశం రవితేజ కొట్టేశారు.ఇవే కాకుండా ఇంకా చాలా మంది డైరెక్టర్లతో ఒప్పందం కుదుర్చుకొని ఆగిపోయిన సినిమాలు కూడా ఉన్నాయి.
ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ నటించి ఉంటే తన జీవితం మరోలా ఉండేదని టాలీవుడ్ వర్గాలు భావిస్తున్నాయి.