మేం వయసుకు వచ్చాం అంటూ తెలుగు సినిమాలో కనిపించి మొదటి సినిమాతో సూపర్ హిట్ కొట్టిన హీరోయిన్ నీతి టేలర్.ఆతర్వాత కూడా తెలుగులో పెళ్లి పుస్తకం, లవ్ డాట్ కామ్ వంటి చిత్రాల్లో నటించినప్పటికీ పెద్దగా హిట్ అవ్వలేదు.
అందుకే కొద్దీ కాలానికే తెలుగు పరిశ్రమకు దూరం అయినా ఈ భామ హిందీలో బుల్లితెరపై కనిపించి అక్కడ తనకంటూ ఓ గుర్తింపు సొంతం చేసుకుంది.హిందీలో ఎన్నో సీరియల్స్ లో నటించిన ఈమెకు మంచి పాపులారిటీ ఉంది.అయితే లాక్ డౌన్ సమయంలో ఈ భామ ఓ ఇంటికి కోడలిగా మారింది.ఆగస్టు 13 న నీతి టేలర్, పరీక్షిత్ బవా అనే వ్యక్తిని పెళ్లి చేసుకుంది.
అయితే మొదటగా వీరిరువురు కుటుంబ సభ్యులు వీరి వివాహం అక్టోబర్ లో ఘనంగా చేయాలని నిర్ణయించుకున్నప్పటికీ కరోనా ఉద్ధృతి రోజురోజుకీ పెరుగుతున్న సమయంలో అక్టోబర్ నాటికి మరింత ఎక్కువగా పెరిగే అవకాశం ఉందన్న ఉద్దేశంతో వీరి వివాహాన్ని ఆగస్టులోనే కేవలం ఇరువురి కుటుంబ సభ్యుల సమక్షంలో పెళ్లిని జరిపించారు.
నీతి టేలర్ తన మ్యారేజ్ వీడియోను తన ఇంస్టాగ్రామ్ అకౌంట్ ద్వారా పోస్ట్ చేస్తూ, మేము మా పెళ్ళి ని అక్టోబర్ లో ఘనంగా జరుపుకోవాలని నిర్ణయించుకున్నాం కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల కారణంగా ఆ వివాహం తొందరగా జరుపుకోవాల్సి వచ్చింది.
అయితే మా పెళ్ళికి కరోనా వైరస్ కారణంగా మా అక్క వాళ్ళు కూడా రాలేదు అంటూ చెప్పిన ఆమె ప్రస్తుతం ఉన్న ఈ పరిస్థితులు కొద్దిగా అదుపులోకి రాగానే, అందరూ కలిసి చిన్న సెలబ్రేషన్ చేసుకోవాలనుకుంటున్నాము అంటూ తన ఇంస్టాగ్రామ్ ద్వారా తన పెళ్లి వీడియోను షేర్ చేశారు.ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.