ఈ మధ్యకాలంలో అందాల ముద్దుగుమ్మలు సినిమాలలో విలన్ గా నటించడానికి ఆసక్తి చూపిస్తున్నారు.ఇప్పటి వరకు హీరోలతో రొమాన్స్ చేసి విసిగిపోయిన భామలు కొత్తగా ట్రై చేయాలని నెగిటివ్ రోల్స్ పై ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నారు.
ఈ నేపధ్యంలో ఇప్పటికే వరలక్ష్మీ శరత్ కుమార్ పవర్ ఫుల్ విలన్ రోల్స్ కి కేరాఫ్ అడ్రెస్ గా మారింది.ఇక ఇదే దారిలో త్రిష కూడా విలన్ గా ధర్మయోగి సినిమాలో మెప్పించింది.
అలాగే రెజినా కూడా ఇప్పటికే 7 అనే సినిమాలో నెగిటివ్ రోల్ లో కనిపించి మెప్పించింది.ఇప్పుడు విశాల్ చక్ర సినిమాలో కూడా ఆమెనే విలన్ గా కనిపిస్తుందని టాక్ వినిపిస్తుంది.
ఇక సమంత కూడా ది ఫ్యామిలీ మెన్ వెబ్ సిరీస్ లో నెగిటివ్ రోల్ చేస్తుంది.ఇప్పుడు ఇదే దారిలో మిల్కీ బ్యూటీ తమన్నా కూడా వచ్చి చేరింది.
సౌత్ ఇండస్ట్రీలో స్టార్ హీరోలందరి సరసన నటించి స్టార్ హీరోయిన్ గా తనకంటూ ఒక బ్రాండ్ సెట్ చేసుకున్న ఈ అమ్మడు ఇప్పటికి తన హవా కొనసాగిస్తుంది.ఇప్పటి వరకు ఎక్కువగా గ్లామర్ రోల్స్ లో కనిపించిన తమన్నా మొదటిసారి తనలోని మరో యాంగిల్ లో ఆవిష్కరించడానికి రెడీ అవుతుంది.
విజయ్, మురుగుదాస్ కాంబినేషన్ లో రానున్న తుపాకీ 2లో అమ్మడు విలన్ గా కనిపించనుందని సమాచారం.ఈ సినిమాలో ఆమె పాత్రకు చాలా ప్రాధానత్య ఉంటుందని, పాకీస్థానీ స్పై ఏజెంట్ గా తమన్నా పాత్రని ఇందులో మురుగదాస్ డిజైన్ చేసినట్లు సమాచారం.
ఇక ఈ సినిమాలో తమన్నా, విజయ్ లమధ్య పవర్ ఫుల్ యాక్షన్ సన్నివేశాలు కూడా ఉంటాయని తెలుస్తుంది.పదేళ్ళ క్రితం తమన్నా విజయ్ తో సుర అనే సినిమాలో రొమాన్స్ చేసింది.
మళ్ళీ ఇన్నేళ్ళ తర్వాత అతనికి ప్రతినాయకగా కనిపించబోతుంది.మరి వీరి మధ్య వార్ ని మురుగదాస్ తెరపై ఏ విధంగా ఆవిష్కరిస్తాడో అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.