ఇండియా అభివృద్ధి చెందుతోంది అనేందుకు నిదర్శనమిదే.. దేశంలోనే అతి పొడవైన రోప్‌ వే.!

భారతదేశం అభివృద్ధి చెందుతోంది అని చెప్పేందుకు దీన్ని మనం నిదర్శనంగా చూపొచ్చు.రాను రాను భారత దేశం అబివృద్ధిపధంలో దూసుకెళుతోంది.

 Longest River Ropeway Over Brahmaputra Guwahati, Ropeway,india, Modi, Bramhaputr-TeluguStop.com

వివిధ రంగాల్లో మనం ప్రగతిని సాధిస్తున్నాం.కరోనా కారణంగా కొన్నింటికి బ్రేకులు పడ్డాయి కానీ.

, మోడీ పుణ్యమాని మన దేశ జెండా ప్రపంచ పటంలో రెపరెపలాడేది.స్వచ్ఛ్ భరత్, డిజిటల్ ఇండియా, ట్రిపుల్ తలాక్ రద్దు, 370వ అధికరణ రద్దు, రామ జన్మభూమి నిర్ణయం, పౌరసత్వ చట్టం ఇలా అనేక విషయాలలో మనం పురోగతి సాధించాం.

ఇకపోతే భారతీయ ప్రకృతిని ఎవరు ఆస్వాదించరు అన్న విషయానికి వస్తే… ప్రపంచదేశాలనుండి పర్యాటకులు వేల సంఖ్యలో ఇక్కడకు వచ్చి ప్రకృతిని ఎంజాయ్ చేస్తూ వుంటారు.కేవలం అదే పనిమీద ఇక్కడకు వచ్చి నెలలు తరబడి తిష్ట వేస్తూ వుంటారు.

పర్యాటక కేంద్రాలు ఇక్కడ అనేకంగా వున్నాయి.అందులో ఒకటి.

బ్రహ్మపుత్రా నది.ఇక్కడ దేశంలోనే అత్యంత పొడవైన నదీ రోప్‌ వే ప్రాజెక్టును(గౌహతి) నిర్మించారు.

మొత్తం 2 కిలోమీటర్ల మేర ఉన్న పొడవైన రోప్‌వే ఇది.

Telugu India, Modi, Ropeway, Small Winds, Swach Barath, Tripul Talak-Latest News

రెండువైపులా అంటే.ఇటు నుంచి అటువైపుకి 7 నిమిషాల వ్యవధిలో చేరవచ్చు.ప్రతీ క్యారేజ్‌ లో 32 మంది వరకు ప్రయాణించవచ్చు.

రోప్‌ వే లో అలా వెళ్తుంటే.కింద హాయిగా ప్రవహించే నీరు.

పైన నీలిమేఘ ఆకాశం.ఇరు ప్రక్కలా హోరుగా వీచే పిల్లగాలులు.

ఆ థ్రిల్లే వేరు.అది అనుభవించే వారికే తెలుస్తుంది.

మనిషి కనీసం ఒక్కసారైనా దర్శించాల్సిన చోటు ఇది.అయితే ఈ రోప్‌ వే ను ఇవాళ జాతికి అంకితం చేయబోతున్నారు.రేపటి నుంచి ఇది ప్రజలకు అందుబాటులోకి రానుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube