బ్యాక్ గ్రౌండ్ లేకుండా వచ్చిన వారిని తమకు సంబంధం లేని వారిని బాలీవుడ్‌లో ఎదగనివ్వకుండా అక్కడ కొందరు ప్రయత్నాలు చేస్తూ ఉంటారు.వారిపై గత కొంత కాలంగా కంగనా రనౌత్ విమర్శలు చేస్తున్న విషయం తెల్సిందే.
కంగనా రనౌత్ చేస్తున్న వ్యాఖ్యలను బట్టి కరణ్ జోహార్ మహేష్ భట్‌లతో పాటు మరికొందరు బాలీవుడ్‌లో మాఫియాగా మారి కొత్తగా వస్తున్న వారిని బ్యాక్ గ్రౌండ్ లేని వారిని తోసేసే ప్రయత్నాలు చేస్తారు.సినిమాలు చేస్తానంటూ దగ్గరకు తీసుకుని కెరీర్ ను నాశనం చేసేందుకు ప్రయత్నాలు చేస్తారంటూ ఆమె ఆరోపించింది.
ఇప్పుడు అదే బాలీవుడ్ మాఫియా ప్రభాస్ చేయబోతున్న సినిమా ఆదిపురుష్‌పై అవాకులు చవాకులు పేలుతున్నట్లుగా ప్రచారం జరుగుతోంది.బాలీవుడ్‌కు చెందిన కొందరు తమ సన్నిహితులతో ఆదిపురుష్‌పై విమర్శలు చేయిస్తున్నట్లుగా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
ఇలాంటి భారీ సినిమాకు ప్రభాస్ ఎలా సెట్ అవుతాడు అని, ఈ సినిమాను హిందీలో ప్రేక్షకులు చూసే అవకాశం లేదని ఓం రౌత్ చేస్తున్న ప్రయత్నం వృదా అవుతుందనే అభిప్రాయంను చాలా మంది అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.మొత్తానికి ఆదిపురుష్ పై ఒక వర్గం ట్విట్టర్‌లో చేస్తున్న కామెంట్స్ ఆశ్చర్యంకు గురి చేస్తున్నారు.
ఆ కామెంట్స్‌లో ప్రభాస్‌ను వారు టార్గెట్ చేయడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.బాలీవుడ్ మాఫియాకు చెందిన వారు అవ్వడం వల్లే ప్రభాస్ ఎంట్రీని వారు తట్టుకోలేక పోతున్నారు.
ప్రభాస్ ప్రస్తుతం బాలీవుడ్ స్టార్ హీరోలను కూడా పక్కకు నెట్టి తాను టాప్‌లో కొనసాగుతున్నాడు.అందుకే కొందరు బాలీవుడ్ మాఫియా వారు ఇలా చేస్తున్నారేమో అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.