స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ ఫిట్ నెస్ విషయంలో ఎంత శ్రద్ధ చూపిస్తుందో అందరికి తెలిసిందే.ఎక్కువ టైం జిమ్ లో స్పెండ్ చేస్తూ పర్ఫెక్ట్ బాడీ షేప్స్ ఉండే విధంగా రకుల్ జాగ్రత్త పడుతుంది.
తనకి ఇష్టమైన యాక్టివిటీ కూడా అదే అనే విషయాన్ని కొన్ని సందర్భాలలో చెప్పుకుంది కూడా.ఇక మంచు లక్ష్మితో రకుల్ కి మంచి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి.
ఇద్దరూ కలిసి రెగ్యులర్ గా ఈవెంట్స్ లో పాల్గొంటూ ఉంటారు.ఇక తాజాగా కరోనా పరిస్థితుల వలన హైదరాబాద్ రోడ్లు చాలా వరకు ఖాళీ అయిపోయాయి.
సెలబ్రిటీలకి అయితే ప్రజల నుంచి అప్పుడు ఉన్నంత ఇబ్బంది ఇప్పుడు లేదు.ఈ నేపధ్యంలో రకుల్, మంచు లక్ష్మి రోడ్డు మీదకి వచ్చారు.
ఏకంగా 30 కిలోమీటర్లు సైక్లింగ్ చేశారు.
హైదరాబాద్‌లోని సుచిత్ర ఎక్స్ రోడ్ నుంచి తూప్రాన్ రోడ్డు మీదుగా వాళ్లిద్దరూ సైకిల్ తొక్కారు.
సైక్లిస్ట్ ఆదిత్యా మెహతా బృందంతో కలిసి వారు ఇందులో పాల్గొన్నారు.ఇందుకు సంబంధించిన ఫొటోలను ఆదిత్య మెహతాతో పాటు రకుల్ ప్రీత్ సింగ్ కూడా సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశారు.
థ్యాంక్యు, చాలా ఇష్టపడి చేశాం.త్వరలో 100 కిలోమీటర్ల సైక్లింగ్ కూడా చేస్తాం అంటూ రకుల్ ప్రీత్ ట్వీట్ చేస్తూ నవ్వుతూ ఉన్న ఎమోజీని పోస్ట్ చేసింది.
ఇదిలా ఉంటే ప్రస్తుతం క్రిష్ దర్శకత్వంలో వైష్ణవ్ తేజ్ హీరోగా తెరకెక్కుతున్న సినిమాలో ఆమె నటిస్తుంది.ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే స్టార్ట్ అయ్యింది.
కరోనా టైంలో కూడా షూటింగ్ లో పాల్గొంటున్న హీరోయిన్స్ లో రకుల్ కాస్తా ముందు వరుసలోనే ఉంది.