యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ బాలీవుడ్ మూవీ ఖరారు అయ్యింది.అది అధికారిక ప్రకటన కూడా వచ్చింది.
బాలీవుడ్ ఫేమస్ దిగ్గజ దర్శకుడు ఓం రౌత్ దర్శకత్వంలో ఆదిపురుష్ చిత్రంతో ప్రభాస్ బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతున్నాడు.ఈ సినిమాకు సంబంధించిన చిత్రీకరణ వచ్చే ఏడాదిలో ప్రారంభించి 2022లో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తామంటూ చిత్ర యూనిట్ సభ్యులు చాలా నమ్మకంగా చెబుతున్నారు.
ఉదయం పోస్టర్ విడుదల చేయడంతో పాటు సాయంత్రం మోషన్ పోస్టర్ను కూడా ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చారు.
వచ్చే ఏడాది ఆరంభం వరకు రాధేశ్యామ్ సినిమా పూర్తి అయ్యేనో లేదో తెలియదు.
ఆ తర్వాత నాగ్ అశ్విన్ మూవీ సినిమా ఇంకా ప్రారంభం కానే కాలేదు.అప్పుడే ప్రభాస్ మూవీ గురించి ప్రకటన రావడం అది కూడా వచ్చే ఏడాదిలో ప్రారంభించి 2022లో విడుదల చేస్తాం అంటూ ప్రకటన రావడంతో ఎవరికి ఇష్టం వచ్చినట్లుగా వారు ఊహించేసుకుంటున్నారు.
వచ్చే ఏడాది మార్చి వరకు రాధేశ్యామ్ పూర్తి అయితే ఆ తర్వాత ఆదిపురుష్ సినిమాను ప్రభాస్ మొదలు పెట్టే అవకాశం ఉంది.

ఈలెక్కన చూస్తే నాగ్ అశ్విన్ మూవీ కాస్త ఆలస్యం అయ్యే అవకాశం ఉంది అంటున్నారు.ఇప్పటికే నాగ్ అశ్విన్ మూవీ ప్రీ ప్రొడక్షన్ క్యాక్రమాలు పూర్తి అయ్యాయి.ఆ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ లాక్ అయ్యింది.
షూటింగ్ కోసం వెయిట్ చేస్తున్నారు.ఇది కూడా భారీ సినిమానే అవ్వడంతో చాలా సమయం అవసరం అవుతుంది.ఒకేసారి ప్రభాస్ రెండు సినిమాల్లో నటించడం సాధ్యమా అంటూ చర్చ జరుగుతోంది.2022 లో నాగ్ అశ్విన్ సినిమాతో పాటు ఆదిపురుష్ను కూడా విడుదల చేస్తామంటున్నారు.కనుక అంతా కాస్త కన్ఫ్యూజ్గా ఉంది అంటున్నారు.నాగ్ అశ్విన్ మూవీ ఆలస్యంగా ప్రారంభం అవుతుందా లేదా రెండు సమాంతరంగా సాగుతాయా అనేది తెలియాల్సి ఉంది.