గ్యాంగ్ వార్ లు అంటే ఎక్కువగా నార్త్ ఇండియా రాష్ట్రాలు గుర్తుకొస్తాయి.బీహార్, మహారాష్ట్ర, ఢిల్లీ లలో ఎక్కువగా గ్యాంగ్ వార్ లు ఆధిపత్యం కోసం జరుగుతూ ఉంటాయి.
ఇలాంటి గ్యాంగ్ వార్ ల నేపధ్యంలో బాలీవుడ్ లో సినిమాలు కూడా వచ్చాయి.దక్షిణాది రాష్ట్రాలలో తమిళనాడులో ఎక్కువగా గ్యాంగ్ వార్ లు కనిపిస్తాయి.
ఇక తెలుగు రాష్ట్రాలలో గ్యాంగ్ వార్ అంటే ముందుగా గుర్తుకొచ్చేది విజయవాడ.ఒకప్పుడు విజయవాడ లో స్టూడెంట్ యూనియన్ గొడవలు, అలాగే రౌడీ గొడవలు విపరీతంగా ఉండేవి.
ఆ కాన్సెప్ట్ తోనే రామ్ గోపాల్ వర్మ శివ సినిమా తీసి హిట్ కొట్టాడు.అయితే తరువాత పోలీసులు విజయవాడలో శాంతి భద్రతలని అదుపులోకి తీసుకొచ్చారు.
అయితే చాలా కాలం తర్వాత మరల తాజాగా గ్యాంగ్ వార్ ఘటన విజయవాడలో జరిగింది.ఇది వీడియోల ద్వారా సోషల్ మీడియాలో వైరల్ కావడంతో రాష్ట్రం మొత్తం తెలిసిపోయింది.
ఈ గ్యాంగ్ వార్ లో తీవ్రంగా గాయపడ్డ సందీప్ అనే వ్యక్తి మృతి చెందాడు.తొలుత ఈ దాడులను రెండు విద్యార్థి గ్రూపుల మధ్య దాడిగా భావించినా, ఆపై ఇది కోట్ల రూపాయల విలువ చేసే స్థలం కోసం జరిగిన గ్యాంగ్ వార్ అని తెలిసింది.
యనమల కుదురులోని ఓ భూ వివాదంలో మణికంఠ, తోట సందీప్ వర్గాల మధ్య ఘర్షణ చెలరేగగా, రాజీ కుదుర్చుకుందాం అంటూ ఇరు వర్గాలు వచ్చాయి.అయితే, ఓ పథకం ప్రకారం రెండు గ్రూపులు ఆయుధాలతో వచ్చాయి.
ఓ మైదానంలో దొమ్మీ జరుగుతోందా అనిపించే స్థాయిలో ఈ గ్యాంగ్ వార్ జరిగింది.ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన తోట సందీప్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు.
కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.