ప్రపంచ వ్యాప్తంగా ఉన్న కరోనా వైరస్ ప్రభావం మెల్లగా క్రీడలపై కూడా పడుతుంది.చాలా దేశాలకి క్రీడలు పెద్ద ఆదాయ వనరుగా ఉంది.
ప్రొఫెషనల్ గేమ్ అయిన క్రికెట్ మీద ఇండియా, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ లాంటి దేశాలలో వేల కోట్ల వ్యాపారం జరుగుతూ ఉంటుంది.దేశవాళీ సిరీస్ పై కూడా ఇక్కడి ప్రజలు ఎక్కువ ఆసక్తి చూపిస్తూ ఉంటారు.
ఈ కారణంగా లైవ్ ప్రసారాలు ద్వారా వేలకోట్లు క్రికెట్ బోర్డులు ఆర్జిస్తూ ఉంటాయి.అయితే ఇప్పుడు కరోనా ప్రభావం కారణంగా క్రికెట్ సిరీస్ లు ఒక్కొక్కటిగా వాయిదా పడిపోతున్నాయి.
ఇప్పటికే ఐపీఎల్ దేశవాళీ క్రికెట్ పండుగా వాయిదా పడేలా కనిపిస్తుంది.ఇప్పుడు అంతర్జాతీయ సిరీస్ మీద కూడా కరోనా ప్రభావం కనిపస్తుంది.ఆస్ట్రేలియా వేదికగా ఈ ఏడాది జరగాల్సిన టీ20 ప్రపంచకప్ టోర్నీ వాయిదాపడినట్టు వార్తలు వెలువడుతున్నాయి.దీనికి సంబంధించి ఇంకా అధికారిక ప్రకటన వెలువడనప్పటికీ ఇది నిజమేనని ఐసీసీ వర్గాలు చెపుతున్నాయి.
నేడు అన్ని దేశాల క్రికెట్ బోర్డులతో జరిగే సమావేశంలో దీనిపై తుది నిర్ణయం వెలువరించే అవకాశం ఉంది.షెడ్యూల్ ప్రకారం అక్టోబర్ 18 నుంచి టీ20 వరల్డ్ కప్ ఆస్ట్రేలియాలో జరగాల్సి ఉంది.
అయితే కరోనా కారణంగా వీసాల ప్రక్రియను ఆ దేశం ఆపేసింది.పర్యాటక వీసాలను సైతం రద్దు చేసింది.
ఈ నేపథ్యంలో ఇప్పట్లో టోర్నీ జరిపేందుకు అనువైన పరిస్థితులు నెలకొనే అవకాశాలు లేకపోవడంతో టోర్నీని వాయిదా వేయనున్నట్లు తెలుస్తుంది.