దర్శకధీరుడు రాజమౌళి డైరెక్ట్ చేస్తున్న ప్రెస్టీజియస్ మూవీ ఆర్ఆర్ఆర్ ఎప్పుడు వస్తుందా అని ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ కలిసి నటిస్తుండటంతో ఈ సినిమా ఎప్పుడు వస్తుందా అని అందరూ ఆతృతగా చూస్తున్నారు.
ఇక ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు అజయ్ దేవ్గన్ కూడా ఓ కీలక పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే.
ఇప్పటికే తన పాత్రకు సంబంధించిన షూటింగ్‌ను ముగించుకున్న అజయ్ దేవ్గన్ డెడికేషన్ గురించి తాజాగా జక్కన్న ఓ ఆసక్తికర కామెంట్ చేశాడు.
అజయ్ దేవ్గన్ సెట్స్‌లో స్టార్ హీరోలా ఏమాత్రం ప్రవర్తించడని, షాట్ అయిపోగానే కారీవ్యాన్లోకి వెళ్లకుండా మామూలు వారీలా సెట్స్‌లోనే గడుపుతాడని జక్కన్న తెలిపాడు.ఇక షూటింగ్ సమయంలో దర్శకుడు చెప్పినదానికి పూర్తి సహకారం అందించడంలో అజయ్ దేవ్గన్ లాంటి వ్యక్తిని తాను చూడలేదని రాజమౌళి అన్నారు.
మొత్తానికి అజయ్ దేవ్గన్ పాత్ర ఈ సినిమాలో చాలా కీలకం కానుందని తెలుస్తోంది.ఇక చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో నటిస్తుండగా, తారక్ కొమురం భీం పాత్రలో నటిస్తున్నాడు.
ఈ సినిమాను వచ్చే జనవరి 8న రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది.