స్టార్ హీరోయిన్ ప్రస్తుతం టాలీవుడ్ లో వరుస సినిమాలతో దూసుకుపోతున్న భామ పూజా హెగ్డే.తాజాగా అల వైకుంఠపురం సినిమాతో సూపర్ హిట్ ని తన ఖాతాలో వేసుకున్న ఈ భామ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉంది.
ఓ వైపు తెలుగులో చేస్తూనే హిందీలో కూడా తన టాలెంట్ తో స్టార్ హీరోయిన్ గా ఎదగాలని ఈ భామ విశ్వ ప్రయత్నాలు చేస్తుంది.ఈ మంగళూరు భామ తెలుగులో మెగా హీరోతో తెరంగేట్రం చేసి ప్రస్తుతం మెగా హీరోలని వరుసగా లైన్ లో పెట్టేసి సినిమాలు చేస్తుంది.
మరో వైపు ప్రభాస్ తో కూడా భారీ బడ్జెట్ సినిమా జాన్ లో హీరోయిన్ గా చేస్తుంది.ఇక క్రిష్, పవన్ కళ్యాణ్ కాంబినేషన్ లో తెరకేక్కబోయే సినిమాలో కూడా పూజాని తీసుకుంటున్నట్లు టాక్ వినిపిస్తుంది.
ఇదిలా ఉంటే ఈ భామ తన బాడీ ఫిట్ నెస్ మెయింటేన్ చేయడం కోసం విపరీతంగా వర్క్ అవుట్స్ చేస్తుంది.ఈ భామకి ఈ పొడుగు కాళ్ళే అందం.
అందుకే త్రివిక్రమ్ తాజా సినిమాలో ఆమె కాళ్ళ మీద సాంగ్ కూడా తీసేశారు.ఇదిలా ఉంటే ఈ లుక్ కోసం ఆమె జిమ్ లో వర్క్ అవుట్ చేసే ఫోటోలు, వీడియోలు అప్పుడప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతాయి.
తాజాగా పూజా జిమ్నాస్టిక్స్ చేస్తున్న స్టిల్స్ బయటకి వచ్చాయి.రెండు కాళ్లు అలా పూర్తిగా స్ట్రెస్ చేయడం చేస్తున్న ఆమె వర్క్ అవుట్ చూసి నెటిజన్లు నోరెళ్ళబెడుతున్నారు.
చాలా మంది హీరోలకే సాధ్యం కాని విధంగా ఈమె కాళ్ళని స్ట్రెస్ చేయడం చూసి ఆ కాళ్ళ అందం చూసే పూజా హెగ్డేకి అందరూ పడిపోతున్నారు అంటూ కామెంట్స్ పెడుతున్నారు.