ప్రదీప్ సినిమా నుంచి ఫస్ట్ వీడియో సాంగ్.. మరో సారి సిద్ శ్రీరామ్ మాయ

స్టార్ యాంకర్ ప్రదీప్ హీరోగా 30 రోజులలో ప్రేమించడం ఎలా అనే సినిమాలో నటించిన సంగతి తెలిసిందే.కొద్ది రోజుల క్రితం ఈ సినిమా ఫస్ట్ లుక్ ప్రేక్షకుల ముందుకి వచ్చి ఆకట్టుకుంది.

 Pradeep Machi Raju Sid Sriram-TeluguStop.com

ఇదిలా ఉంటే ఈ సినిమా నుంచి నీలి నీలి ఆకాశం అంటూ సాగే వీడియో సాంగ్ ని చిత్ర యూనిట్ ప్రేక్షకుల ముందుకి తీసుకొచ్చింది.ప్రస్తుతం స్టార్ సింగర్ గా టాలీవుడ్ లో తన హవా చూపిస్తున్న సిద్ శ్రీరామ్ ఈ పాటని ఆలపించగా చంద్రబోస్ లెరిక్స్ అందించారు.

అనూప్ రూబెన్స్ ఈ సాంగ్ కి స్వరాలు సమకూర్చారు.

తాజాగా ప్రేక్షకుల ముందుకి వచ్చిన ఈ సాంగ్ మంచి మెలోడీతో ప్రేమ భావనని చెప్పే విధంగా ఉంది.

ఇక ఈ వీడియోని ఎత్తైన కొండల మధ్య మంచు పడుతూ ఉంటే చిత్రీకరించినట్లు కనిపిస్తుంది.అందుకే విజువల్ కూడా చాలా గ్రాండ్ గా కనిపిస్తుంది.ఇక ఈ సాంగ్ ని సూపర్ స్టార్ మహేష్ బాబు చేతుల మీదుగా ఆవిష్కరించారు.ఈ సినిమాతో సుకుమార్ శిష్యుడు మున్నా దర్శకుడుగా పరిచయం అవుతున్నాడు.

టాలీవుడ్ లో ఉన్న సెంటిమెంట్ ప్రకారం సిద్ శ్రీరామ్ తో పాట పాడించి ఫస్ట్ సాంగ్ రిలీజ్ చేసిన ప్రతి సినిమా సూపర్ హిట్ అయ్యింది.మళ్ళీ ఆ లుక్ ని రిపీట్ చేసి హీరోగా ప్రదీప్ హిట్ కొడతాడెమో చూడాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube