బాలీవుడ్ స్టార్ హీరోగా తనకంటూ గుర్తింపు సొంతం చేసుకున్న కండల వీరుడు సల్మాన్ ఖాన్.బాలీవుడ్ లో కోట్ల రూపాయిల పారితోషికం తీసుకునే సల్మాన్ ఖాన్ రియాలిటీ షో బిగ్ బాస్ ద్వారా కూడా అదే స్థాయిలో సంపాదిస్తూ ఉంటాయి.
ఇక తన సంపాదనని సేవా కార్యక్రమాలు చేయడానికి కూడా సల్మాన్ ఖాన్ ఉపయోగిస్తూ ఉంటాడు.తాను సహాయం చేస్తూనే సామాజిక సేవలో ఇతరులకి కూడా ఖాన్ స్ఫూర్తిగా ఉంటూ ఉంటారు.
ముంబై పోలిసుల సంక్షేమం కోసం ప్రతి ఏటా ఉమాంగ్ పేరుతో విరాళాల సేకరణ కార్యక్రమాన్ని కూడా సల్మాన్ ఖాన్ నిర్వహిస్తున్నారు.ఈ ఏడాది కూడా ఈ కార్యక్రమాన్ని వేడుకగా జరిపారు.
ఇదిలా ఉంటే ఈ ఫండ్ రైజింగ్ షోలో బాలీవుడ్ సెలబ్రిటీలు చాలా మంది పాల్గొన్నారు.ఇక ఈ కార్యక్రమంలో కపిల్ శర్మతో సల్మాన్ ఖాన్ ముచ్చటించారు.ఈ సందర్భంగా తన జీవితంలో ఇబ్బంది పడిన ఓ సంఘటన గురించి పంచుకున్నారు.ఓ రోజు సైకిల్ టైర్ మార్చడం కోసం తెలిసిన ఓ మెకానిక్ దగ్గరకు వెళ్ళాను.
ఆ సమయంలో నేను షార్ట్స్ లో ఉండటంతో డబ్బులు లేవు సైకిల్ రిపేర్ చేసి ఇస్తే తర్వాత డబ్బులు ఇస్తానని అతని చెప్పాను అయితే ఆ మెకానిక్ నా వైపు చూసి నువ్వు చిన్నప్పుడు ఇలాగే చేసేవాడివి, చిన్న వయసులో నా దగ్గరకి వచ్చి సైకిల్ రిపేర్ చేయించుకొని వెళ్ళావు.దానికి సంబందించిన డబ్బులు ఇప్పటివరకు ఇవ్వలేదు.
నువ్వు నాకు ఇప్పటికి రూపాయి పావలా బాకీ ఉన్నావ్ అని అన్నాడు.అతను అలా అనేసరికి ఏమి మాట్లాడాలో అర్ధం కాలేదు.
చాలా చిన్నతనంగా అనిపించింది అని సల్మాన్ ఖాన్ చెప్పారు.మొత్తానికి ఇలా సల్మాన్ ఖాన్ తెలియకుండానే ఓ సైకిల్ మెకానిక్ కి రూపాయి పావలా బాకీ పడటం, అది సల్మాన్ స్వయం చెప్పడం ఆసక్తికరంగా మారింది.