పోలీసులు చెప్పినట్లే దిశ కాలేయం లో మద్యం ఆనవాళ్లు,ఫోరెన్సిక్ రిపోర్ట్

ఇటీవల హైదరాబాద్ లోని షాద్ నగర్ లో చోటుచేసుకున్న దిశ అత్యాచారం,హత్య ఘటనలో రోజుకో కీలక అంశాలు వెలుగులోకి వస్తున్నాయి.గతనెల నవంబర్ 27 న చోటుచేసుకున్న దిశ అత్యాచార ఘటనలో నిందితులుగా ఉన్న నలుగురు నిందితులు ఈ మధ్య పోలీసుల ఎంకౌంటర్ లో మృతి చెందారు.

 Forensic Report Finds Liquor In Disha Body-TeluguStop.com

పక్కా ప్రణాళిక తో నమ్మించి అత్యంత దారుణంగా దిశ పై అత్యాచారానికి వడిగట్టడమే కాకుండా అనంతరం ప్రాణాలు తీసి ఎలాంటి ఆధారాలు దొరకకూడదు అన్న ఉద్దేశం తో ఆమె మృతదేహం పై పెట్రోల్,కిరోసిన్ కలిపి పోసి నిప్పంటించి దారుణంగా హత్య చేసిన విషయం తెలిసిందే.అయితే ఈ ఘటన దేశవ్యాప్తంగా కూడా పెను సంచలనం సృష్టించింది.

ఢిల్లీ నిర్భయ ఘటన తరువాత ఆంతే రేంజ్ లో ఈ ఘటనపై కూడా నిరసన లు వెల్లువెత్తాయి.అయితే అత్యాచార నిందితులను ఎంకౌంటర్ చేయడం తో తెలంగాణా పోలీసులపై ప్రశంశల వర్షం తో పాటు పూల వర్షం కూడా కురిపించారు.

అయితే అత్యాచార నిందితులను విచారించిన సమయంలో ఆమెపై అత్యాచారం చేసే సమయంలో ఆమె వారిస్తుండడం తో బలవంతంగా మద్యం తాగించినట్లు తెలిపిన విషయం తెలిసిందే.అయితే తాజాగా దిశ ఫోరెన్సిక్ రిపోర్టు లో ఆ విషయం తేటతెల్లమైంది.

పోలీసుల చేతికి ఈ కీలక ఆధారం లభ్యమైంది.ఆమె కాలేయంలో మద్యం ఆనవాళ్లు ఉన్నట్టు నిపుణులు గుర్తించారు.

అత్యాచారానికి ముందు నిందితులు ఆమెతో బలవంతంగా మద్యం తాగించారన్న విషయం ఈ ఒక్క రిపోర్ట్ తో రుజువైంది.

నిందితుల విచారణ సమయంలో అత్యాచార సమయంలో ఆమె నోట్లో మద్యం పోశామని నిందితులు ఒప్పుకున్నట్లు పోలీసులు ముందే తెలిపిన విషయం తెలిసిందే.

అయితే పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం చూసుకుంటే ఫోరెన్సిక్ లో కూడా అదే విషయం ధ్రువీకృతమైంది.గతనెల చోటుచేసుకున్న ఈ దారుణ ఘటనలో దిశ కు కేవలం పదిరోజుల్లోనే తెలంగాణా పోలీసులు న్యాయం చేశారు అని పలువురు దేశ వ్యాప్తంగా ప్రసంశల వర్షం కురిపిస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube