కొందరు కళాకారులు వేసిన పెయింటింగ్స్‌కు వెల కట్టలేం.కోట్ల రూపాయలు పెట్టి కొన్ని కళా ఖండాలను పెయింటింగ్స్ అంటే ఇష్టపడే వారు కొనుగోలు చేస్తూ ఉంటారు.
ఒక సింపుల్ పెయింటింగ్‌ను కోట్లు పెట్టి కొనాల్సిన అవసరం ఏంటా అంటూ చాలా మంది ఆశ్చర్యపోతారు.కాని ఆ కొన్న వ్యక్తికి మాత్రమే అసలు విషయం తెలుస్తుంది.
దాని విలువ ఏంటీ, ఎందుకు దానికి అంత ఖరీదు అనేది కొద్ది మందికి మాత్రమే తెలుస్తుంది.కొందరు తమ వద్ద కోట్ల రూపాయల పెయింటింగ్ ఉన్నా కూడా దాన్ని గుర్తించలేరు.
అచ్చు అలాగే జరిగింది ఒక సంఘటన.విషయం ఏంటంటే ప్రాన్స్‌కు చెందిన ఒక వృద్ద ఒంటరి మహిళ చాలా ఏళ్లుగా తన ఇంట్లో ఒక పెయింటింగ్‌ను కలిగి ఉంది.
ఆ పెయింటింగ్ ఆమె వంట రూంలోని ఒక మేకుకు తగిలించింది.ఆ పెయింటింగ్ ఆమె వద్దకు ఎలా వచ్చింది అనేది ఆమెకు తెలియనే తెలియదు.అది జీసెస్‌కు సంబంధించిన పెయింటింగ్ అవ్వడం వల్ల ఆమె అలాగే దాచి పెట్టిందట.జీసెస్ కాకుండా మరెవ్వరైనా ఉన్నా లేదంటే మామూలు డ్రాయింగ్ లేదా పెయింటింగ్ అయినా కూడా దాన్ని ఆమె బయట పడేసేది.

పెయింటింగ్‌కు ఉన్న విలువ ఆమెకు తెలియదు.ఇటీవల ఒక వ్యక్తి ఆమెను పరామర్శించేందుకు వెళ్లగా ఆమె ఇంట్లో ఆ ఫొటో ప్రేమ్‌ను చూశాడు.వంట గదిలో ఉన్న కారణంగా మసితో పాటు ఇంకా పలు రకాల మురికి దానికి పట్టి ఉంది.అతడు దాని విలువ గుర్తించాలనుకున్నాడు.ఆన్ లైన్ లో ఆ ఫొటోను పోస్ట్ చేయగా అది 13వ శతాబ్దంలో క్రైస్ట్ అనే ప్రపంచ ప్రసిద్ది కళాకారుడు గీసినట్లుగా తేలింది.అతడు క్రీస్తు జీవితాన్ని ఆవిష్కరించేందుకు కొన్ని పెయింటింగ్స్ వేశాడు.
అందులో ఇది ఒకటి.

ఈ పెయింటింగ్స్ కోసం చాలా మంది చాలా కాలం పాటు చూశారు.చివరకు ఆ వృద్ద మహిళ ఇంట్లో ఉందని గుర్తించి ఆశ్చర్యపోయారు.ప్రస్తుతం దాని విలువ దాదాపుగా ఇండియన్ రూపీస్ ప్రకారం 50 కోట్లు.
అంత ఖరీదైన పెయింటింగ్‌ను ఆమె గుర్తించకుండా అత్యంత నిర్లక్ష్యంగా వ్యవహరించింది.అయినా కూడా అదో గొప్ప పెయింటింగ్ అవ్వడం వల్ల ఎక్కువగా చెడిపోలేదు.
చిన్న చిన్న మరకలు తప్ప అది ఎక్కువగా పాడవ్వలేదని వేలం వేయబోతున్న వారు అంటున్నారు.త్వరలో వేలం వేయబోతున్న నేపథ్యంలో 50 కోట్లకు మించి అమ్ముడు పోతుందనే నమ్మకం అయితే వ్యక్తం అవుతుంది.
తన వద్ద ఉన్న ఆ క్రీస్తు బొమ్మ అంత విలువైనదని నేను అనుకోలేదని ఆ వృద్దురాలు చెప్పుకొచ్చింది.